White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 03:46 PM

White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

White Rice Vs Brown Rice :  భారతీయులు అన్నం లేకుండా ఆహారం అసంపూర్ణంగా పరిగణిస్తారు. రైస్ లో ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్, ఫైబర్లు చాలా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్ దేని ప్రయోజనాలు దానివే. చాలా మంది తరచుగా వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య ఏది మంచిదో అనే సందిగ్ధం అందరిలో ఉంటాయి.

వైట్ రైస్ పోలిష్ చేయడానికి ముందు గోధుమ రంగులో ఉంటుంది. పాలిష్ చేయని బియ్యాన్ని మాత్రమే బ్రౌన్ రైస్ గా విక్రయిస్తున్నారు. పాలిష్ కి ముందు తెల్ల బియ్యాన్ని తృణధాన్యాలు అంటారు. పాలిష్ పెట్టేటప్పుడు ఊక, మొలకలలో కొంత భాగాన్ని తొలగిస్తారు. ఊకలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలిష్ చేసిన తర్వాత తెల్ల బియ్యం నుండి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తొలిగిపోతాయి.

Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

వండిన వైట్ రైస్లో 70%, బ్రౌన్ రైస్ లో 50% గ్లైసెమిక్ ఉంటుందని పోషకాహార నిపుణులు తెలిపారు. అంటే వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెద్దగా పెంచదు. డయాబెటిస్ పేషెంట్లకు బ్రౌన్ రైస్ మంచి ఎంపిక. తెల్ల బియ్యం తినడం వల్ల అవసరమైన ఫైబర్ శరీరానికి చేరదు. పోషకాహార నిపుణుల పరిశోధన ప్రకారం బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ తినడం వల్ల బెరిబెరి వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. దీంతో విటమిన్ B1 లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా బియ్యం ప్రధాన ఆహారంగా తీసుకునేవారు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా బ్రౌన్ రైస్ ఎంతో మంచిది.