Weak Up Early : ఉదయాన్నే నిద్ర లేవండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 5, 2022 | 09:00 PM

Weak Up Early : ఉదయాన్నే నిద్ర లేవండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Weak Up Early :  పాతకాలంలో అందరికి 80 సంవత్సరాలు వచ్చినా చాలా ఆరోగ్యంగానే ఉండేవారు కానీ ఇపుడు అనారోగ్యం కలగడానికి వయసుతో సంభంధం అనేది లేకుండా ఉంది. ఏ వయసు వారికైనా ఎలాంటి రకమైన వ్యాధులైన రావచ్చు. అప్పుడు అందరూ తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేచేవారు. కానీ ఇపుడు అందరూ కూడా రాత్రి పూట లేటుగా పడుకొని ఉదయం కూడా లేటుగా లెగుస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ వచ్చాక బెడ్ మీదకెక్కి ఫోన్ పట్టుకొని చూస్తూ పడుకొని ఉదయం లేట్ గా లెగుస్తున్నారు.

మనం అందరం కూడా మన పనులన్నింటిని తొందరగా ముగించుకొని తొందరగా పడుకొని ఉదయాన్నే 4 లేదా 5 గంటలకు నిద్ర లేస్తే చాలా మంచిది. ఎన్నో రకాల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మనకు పనులు చేసుకోవడానికి మనకు ఎంతో సమయం మిగిలి ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది.

China : ప్రపంచానికి కొత్త వరి పరిచయం చేయబోతున్న చైనా.. ఇక ఆకలి బాధలు ఉండవు..

ఉదయాన్నే లేచి చల్లని గాలిలో సూర్యుని కిరణాలలో మన శరీరాన్ని ఉంచితే మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఉదయాన్నే లేవడం వలన మనం ఏ పనినైనా ఎంతో హుషారుగా చేస్తూ ఉంటాము. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఎంతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే లేవడం వలన మనం యోగ, ధ్యానం, వాకింగ్ వంటివి చేసి మన శరీరం ఫిట్ గా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే లేచి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి.