Walking Shoes : వాకింగ్ చేస్తున్నారా.. షూస్ కచ్చితంగా వాడండి.. లేకపోతే..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 06:00 PM

Walking Shoes : వాకింగ్ చేస్తున్నారా.. షూస్ కచ్చితంగా వాడండి.. లేకపోతే..

Walking Shoes :  నడక చాలా ఉత్తమమైన వ్యాయామం. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా సులభంగా నడవచ్చు. ఒక గంట సేపు నడవటం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. వారానికి కనీసం ఐదు రోజులు వేగంగా నడవాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే నడకకు వెళ్ళే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫిట్నెస్ నిపుణుల సూచన.

సౌకర్యవంతమైన దుస్తులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా మంచి బూట్లు వాడడం ముఖ్యమని చెబుతున్నారు. షూస్ కొనేముందు వాటి డిజైన్, కలర్ తో పాటు ముఖ్యంగా అవి ఎంత సౌకర్యంగా ఉన్నాయి, బరువుకు సరిపోయేవి, మన్నిక, కుషన్ వంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. రన్నింగ్ షూస్ 180 గ్రాములు నుండి 370 గ్రాములు బరువు ఉంటాయని షూస్ కంపెనీ వాళ్ళు చెబుతున్నారు.

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

సరైన బూట్లు ధరించడం వల్ల పాదాలు, మోకాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ చేసే వాళ్ళు సరైన షూస్ ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. సరిపోని షూస్ వల్ల మడమలు, చీలమండలంఫై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. షూస్ ధరించినపుడు కాలి వేళ్ళు కదిలించడానికి తగిన స్థలం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సరియిన పట్టు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నడక మంచిదే కానీ నడక వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ముందుగా మంచి షూస్ తీసుకోవాలి. స్లిప్పర్స్,సాండల్స్ వాకింగ్ కి వద్దంటున్నారు నిపుణులు. అందుకే వాకింగ్ కి బూట్లు కొనుగోలు చేసేటప్పుడు అన్ని చూసి మంచివి కొనుక్కోండి.