Plastic Straw : ప్లాస్టిక్ స్ట్రాలు ఎక్కువగా వాడుతున్నారా?? అయితే జాగ్రత్త.. ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా??

మనంలో చాలా మంది కూడా డ్రింక్స్, జ్యూస్, కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు స్ట్రా వాడుతుంటారు అవి ఎక్కువగా ప్లాస్టిక్ వి వాడుతున్నారు. దీని వలన మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.......

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 06:19 AM

Plastic Straw : ప్లాస్టిక్ స్ట్రాలు ఎక్కువగా వాడుతున్నారా?? అయితే జాగ్రత్త.. ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా??

Plastic Straw :  మనంలో చాలా మంది కూడా డ్రింక్స్, జ్యూస్, కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు స్ట్రా వాడుతుంటారు అవి ఎక్కువగా ప్లాస్టిక్ వి వాడుతున్నారు. దీని వలన మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రాలు పేపర్ తో చేసినవి కూడా ఉన్నాయి కాబట్టి వీటిని వాడడం వలన ఎలాంటి అనారోగ్యం కలుగదు. కానీ ఎక్కువగా ప్లాస్టిక్ వే దొరకడంతో అందరూ అవే వాడతారు.

ప్లాస్టిక్ స్ట్రాతో మనం ఏది తాగినా వాటితో పాటు ప్లాస్టిక్ లోని రసాయనాలు కలుస్తాయి. అవి ముందుగా మన దంతాలపై ఉన్న ఎనామిల్ కు అతుక్కుపోతాయి. దీని వలన మనకు దంత క్షయం మరియు కావటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా దంతాలు బలహీనంగా కూడా తయారవుతాయి. ఈ మధ్య కాలంలో సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్ తినడం వాటితో పాటు స్ట్రాతో కూల్ డ్రింక్స్ తాగడం చాలా మందికి అలవాటు అయింది. దీంతో అనేక రకాల నోటి సమస్యలు వస్తాయి.

మంచి నీరు, జ్యూస్ లు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వలన మనకు ఒక రకమైన వాసన కూడా వస్తుంది. దీని వలన మనకు ఎక్కువ ఆకలిగా కూడా అనిపించి ఎక్కువ తింటూ ఉంటాము. ఈ విధంగా మనం బరువు ఎక్కువగా పెరుగుతాము. స్ట్రాను ఉపయోగించి తాగడం వలన పెదాలపై కూడా ప్రభావం చూపుతుంది. పెదాలు తొందరగా ఎండిపోతుంటాయి, డ్రైగా తయారవుతాయి. ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగించడం వలన ముఖంపై ముడతలు కూడా తొందరగా వస్తాయి.

Saffron : కుంకుమ పువ్వుని ఇలా వాడి అందంగా తయారవ్వండి.. ఎన్ని ప్రయోజనాలో కుంకుమపువ్వుతో..

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు ప్లాస్టిక్ స్ట్రా ఉన్న బాటిల్స్ తో ఎక్కువగా నీళ్ళు తాగడం అలవాటు చేస్తున్నారు. దీని వలన చిన్నప్పటి నుండే వీరు ఎక్కువగా దంత సమస్యలు, అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగించి ఎక్కువగా జ్యూస్ లు, కొబ్బరి నీళ్ళు, మంచి నీళ్ళు తాగడం మంచి పద్దతి కాదు, పిల్లలకు కూడా ప్లాస్టిక్ స్ట్రాతో నీళ్ళు తాగే పద్దతిని తగ్గించాలి.