Potato face Pack : బంగాళాదుంపతో అందం ఇలా..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 07:00 PM

Potato face Pack : బంగాళాదుంపతో అందం ఇలా..

Potato face Pack :  ప్రతి ఒక్కరికి అందంగా కనిపించడం ఇష్టం. అలా మెరిసిపోవాలని బ్యూటీ టిప్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పొడిబారకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుందని భావిస్తారు. చలికాలం వస్తే ముఖం, చర్మం పొడిబారిపోతుంది, కాంతి కోల్పోయి ముఖం తేజోవంతంగా ఉండదు. అయితే మన వంట ఇంటి పదార్థాలతో ఒక మంచి అద్భుతమైన ముఖ సౌందర్యం మీ సొంతం చేసుకోవచ్చు.

కాంతి వంతమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంట ఇంటి పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ చేసుకొని మంచి రిజల్ట్ చూడవచ్చు. బంగాళాదుంపతి ఇలా చేస్తే మన ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆలు పేస్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకొని, ఎలా అప్లై చేయాలో చూద్దాం.

కావలసిన ఐటమ్స్- ఆలు, పెసలు, గ్రీన్ టీ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు.

తయారీ విధానం-

మొదట రెండు టేబుల్ స్పూన్స్ పెసలు తీసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బంగాళాదుంపను తొక్క తీసి కట్ చేసి, గ్రైండ్ చేసి వడకట్టి పెట్టుకోవాలి. ఆ ఆలు వాటర్ లో పెసల పొడి కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు,1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక ఒక అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.

ఈ ప్యాక్ తో ముఖం కడిగేటప్పుడు నెమ్మదిగా మర్దన చేస్తూ కడగాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మ రంధ్రాలు తెరచుకొని చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై ఉన్న దుమ్ము ధూళి పూర్తిగా తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా మనం ఏదైనా స్పెషల్ డేస్ లో, ఏదైనా శుభకార్యానికి వెళ్లేముందు ఈ ప్యాక్ వేసుకుంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

బంగాళాదుంపలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలతో పాటు ఆహార యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి. అందువల్ల బంగాళదుంప ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్ బి మరియు ‘సి’లు చర్మం కాంతివంతంగా అయ్యేలా చేస్తాయి. అందుకే బంగాళదుంపని తినడానికే కాదు బ్యూటీకి కూడా వాడుకోవచ్చు.