Turmeric Powder : పసుపు పూజలకే కాదు.. ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం..

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 05:00 PM

Turmeric Powder : పసుపు పూజలకే కాదు.. ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం..

Turmeric Powder :  మన సాంప్రదాయంలో పసుపు లేనిదే ఏ వంట, ఏ పూజ పూర్తి కాదనే చెప్పాలి. పులిహోర, రసాలు, కూరలు.. ఇలా ఏది తీసుకున్నా పసుపు ఉండాల్సిందే. కొన్ని వంటల్లో పసుపు కొంచెం తగ్గినా కలర్ & టేస్ట్ రెండూ తగ్గిపోతాయి. కిచెన్ లో ఉండే ఆయుర్వేద ఔషధాలలో మొదటిది పసుపు. అందుకే తాలింపు డబ్బాల్లో దీన్ని ఉంచుకుంటారు. ఇక దైవత్వంలో కూడా ఈ పసుపుని వాడుతుంటారు. ఇక వాడుకలో పసుపు కుంకుమ పెట్టాలి ఆడపిల్లలకి అనేది భారతీయ సాంప్రదాయం కూడా. మన గుమ్మలకి కూడా పసుపు పెడతాము ఎలాంటి క్రిమి కీటకాలు రాకుండా ఉండేందుకు.

సాంప్రదాయంలోనే కాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఈ పసుపును బాగా ఉపయోగిస్తారు. ఆడవాళ్లు అయితే స్నాన సమయంలో పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం అనేది అందరికీ తెలిసిన విషయమే, అయితే అందులో కొంచెం పసుపు కలిపి తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సమస్యలు దూరమవుతాయి. పసుపులో కర్క్యుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

Jaggery : పంచదారకు రీప్లేస్మెంట్ బెల్లం.. పంచదారని వదిలేసి బెల్లం అలవాటు చేసుకోండి..

పసుపుతో వేడి నీటిని కలిపి ఆవిరి పడితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. శనగపిండి, పసుపు, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ఫ్రెష్ గాను ఉండటమే కాక చర్మంపై ముడతలు తొందరగా రానివ్వదు. రాత్రిపూట చిటికెడు పసుపు కలిపిన పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుచేత రెగ్యులర్ డైట్ లో పసుపును తీసుకోవడం చాలా మంచిది. ఇలా పసుపు అటు సంప్రదాయానికి, ఆరోగ్యానికి ఇటు బ్యూటీకి అన్ని రకాలుగా మంచిది కాబట్టి పసుపు అన్ని రకాలుగా మన రోజు వారి జీవితంలో భాగం అయింది.