Afternoon Sleep : మధ్యాహ్నం నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..

Kaburulu

Kaburulu Desk

November 22, 2022 | 12:47 PM

Afternoon Sleep : మధ్యాహ్నం నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..

Afternoon Sleep :  అందరూ ఉదయం చాలా హుషారుగా వర్క్ చేసుకుంటారు కానీ మధ్యాహ్న సమయానికి అన్నం తిన్న తరువాత మాత్రం నిద్ర ముంచుకొస్తుంది. దానికి కారణం మనం తినే అన్నంలో ఉండే గ్లూకోజ్ వేగంగా రక్తంలో కలవడం మరియు మెలటోనిన్, సెరోటోనిన్ అనే ప్రశాంతతను కలుగచేసే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవేకాక ఇంకా కొన్ని పిండి పదార్థాలు కూడా మనకు నిద్రను కలిగేలా చేస్తాయి. అలాగే మనం ఉదయం నుండి పని చేసి ఉండడం వలన కూడా మానసిక శక్తి తగ్గి అలసటగా అనిపించి కూడా నిద్ర వస్తుంది.

Eyes Protection : కళ్ళు దురదలుగా ఉంటున్నాయా? కళ్ళకు విశ్రాంతి లేదా? అయితే ఈ పనులు చేయండి..

మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహరంతోనే మేనేజ్ చేయొచ్చు. మధ్యాహ్నం భోజనంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అవి మనలో డోపమైన్, ఎపినెఫ్రిన్ అనే చురుకైన రసాయనాలను విడుదల చేసి మెదడు ఉత్సాహంగా పని చేయడానికి తోడ్పడుతుంది. అన్నం తినకుండా ఉండలేని వాళ్ళు బాస్మతి బియ్యం తింటే మంచిది. దీనిలోని గ్లూకోజ్ తొందరగా రక్తంలో కలవదు. అలాగే అన్నానికి బదులుగా జొన్న, సజ్జ, గోధుమ, రాగి పిండి రొట్టెలు తినవచ్చు. మాంసాహారులైతే చికెన్ తో పాటు కూరగాయలు కూడా తీసుకోవాలి. ఇలా మధ్యాహ్నం మనం తినే భోజనంలో కొన్ని మార్పులు చేసుకుంటే నిద్రని తరిమికొట్టి యాక్టివ్ గా ఉండొచ్చు.