Eyes Protection : కళ్ళు దురదలుగా ఉంటున్నాయా? కళ్ళకు విశ్రాంతి లేదా? అయితే ఈ పనులు చేయండి..

Kaburulu

Kaburulu Desk

October 9, 2022 | 02:46 PM

Eyes Protection : కళ్ళు దురదలుగా ఉంటున్నాయా? కళ్ళకు విశ్రాంతి లేదా? అయితే ఈ పనులు చేయండి..

Eyes Protection :  ఇటీవల అందరికి కళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. రోజూ పెరుగుతున్న కాలుష్యం వల్ల కళ్ళ పై ప్రభావం ఎక్కువగా చూపుతోంది. అంతేకాక కంప్యూటర్, సెల్ ఫోన్లలను వాడడం వల్ల కూడా కళ్ళకు విశ్రాంతి తగినంతగా లభించడం లేదు. అలసిన కళ్ళ వల్ల కళ్లకే కాక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కళ్ళకి చాలా విశ్రాంతి అవసరం.

రోజూ అలసిపోతున్న కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, అలసట తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.
*అలసిన కళ్ళకు ఒక బంగాళాదుంపను తీసుకుని దాన్ని సన్నటి చిప్స్ లా కట్ చేసి. రెండు కళ్ళమీద పెట్టుకోవాలి. అరగంట సేపు అలా కళ్ళ మీద పెడితే చక్కని ఉపశమనం లభిస్తుంది.
*ఎర్రగా వున్నా కళ్ళకు కీరదోసకాయ ముక్కలను కళ్లపై 20 నిమిషాలపాటు పెడితే కళ్లకు చల్లదనం కలిగి కళ్లు తాజాగా ఉంటాయి.
* కంటికి సంబంధించిన అసౌకర్యాన్ని ఆముదం పోగొడుతుంది. కళ్ళు దురదలుగా, అసౌకర్యంగా అనిపించినప్పుడు ఆముదం కంటి రెప్పలకు రాస్తే ఉపశమనం లభిస్తుంది.

Date Palm : ఖర్జురాలు తినడం ఎంత అవసరమో తెలుసా??