Women Hair : అమ్మాయిలూ.. పెళ్ళికి రెడీ అవుతున్నారా.. మీ జుట్టుని అందంగా ఇలా తయారుచేసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 3, 2022 | 05:50 PM

Women Hair : అమ్మాయిలూ.. పెళ్ళికి రెడీ అవుతున్నారా.. మీ జుట్టుని అందంగా ఇలా తయారుచేసుకోండి..

Women Hair :  అమ్మాయిలకి అందాన్ని తెచ్చిపెట్టేది వాళ్ళ శిరోజాలే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఇంకా ఎక్కువగా రెడీ అవుతుంటారు. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చింది కాబట్టి అందరు అమ్మాయిలు మేకప్, ఫ్యాషన్ జడలు వేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురే కాదు పెళ్ళికి వెళ్లే వారు ఎవరైనా కూడా రకరకాల జడలు వేసుకుంటారు. అందుకు ఈ టిప్స్ శిరోజాలకోసం పాటిస్తే మీ జుట్టు ఎంతో అందంగా కనబడుతుంది.

ముఖ్యంగా జుట్టుకి రోజూ నూనె రాస్తూ ఉండాలి దీని వలన మీ జుట్టు మృదువుగా ఆరోగ్యంగా మారుతుంది. మీ జుట్టుకి మంచి పోషణ లభించడం కోసం కొబ్బరినూనె, బృంగరాజ్ ఆయిల్, ఆముదం వంటి నూనెని రాయవచ్చు. వీటిని రాసిన తరువాత ఒక గంట లేదా రెండు గంటలకు తలస్నానం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

తలస్నానం కూడా కుంకుడుకాయలతో చేస్తే ఇంకా బాగుంటుంది. కుంకుడుకాయలతో మేము చేయలేము అనుకుంటే ఆర్గానిక్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఖచ్చితంగా హెయిర్ మాస్క్ వేసుకోవాలి.

Also Read………….. Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

అరటిపండు, తేనె, పెరుగు కలిపి మెత్తగా చేసుకొని దానిని జుట్టుకు అప్లై చేసిన 20 నిముషాల తరువాత తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు అందంగా కనిపిస్తుంది. ఇక బియ్యాన్ని నానబెట్టిన నీటిని జుట్టుకు పట్టించి ఒక అరగంట తరువాత తలస్నానం చేసినా మన జుట్టు బాగుంటుంది. మెంతులు, పెరుగు కలిపి జుట్టుకు పట్టించి ఒక అరగంట తరువాత తలస్నానం చేయడం వల్ల కూడా శిరోజాలు అందంగా కనపడతాయి.