Fruits for Pregnant Women : గర్బిణులు ఈ పండ్లు ఎక్కువగా తినాలి..

గర్బిణులుగా ఉన్నప్పుడు అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు దానికోసం ఎక్కువగా ఏం తినాలి, ఏం తినకూడదు అన్నీ తెలుసుకుకొని జాగ్రత్తగా తింటారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడానికి............

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 08:19 PM

Fruits for Pregnant Women : గర్బిణులు ఈ పండ్లు ఎక్కువగా తినాలి..

Fruits for Pregnant Women :  గర్బిణులుగా ఉన్నప్పుడు అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు దానికోసం ఎక్కువగా ఏం తినాలి, ఏం తినకూడదు అన్నీ తెలుసుకుకొని జాగ్రత్తగా తింటారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడానికి పోషికాహారం తినేలా చూసుకోవాలి. పండ్లు తినడం వలన సాధారణంగానే మన ఆరోగ్యానికి మంచిది. మంచి పోషకాహారం లభిస్తుంది. గర్భిణీలుగా ఉన్నప్పుడు కూడా పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే ఎక్కువగా ఏ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా??

Asafoetida : వంటింట్లోని ఇంగువ.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా??

*నారింజ పండులో ఉండే ఫోలిక్ ఆసిడ్, ఫోలేట్, విటమిన్ బి మన శరీరం హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. మెదడు, వెన్నునాడులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
*మామిడి కాయలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎ మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
*అవకాడోలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గర్భిణులకు వాంతులు, వికారం తగ్గేలా చేస్తుంది.
*గర్భిణులు నిమ్మకాయను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. గర్భిణులకు ఎప్పుడైనా వాంతులు లేదా వికారంగా అనిపించినా నిమ్మకాయను వాసన చూడడం లేదా నిమ్మరసం కొద్దిగా తాగవచ్చు. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
*ద్రాక్ష లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ద్రాక్ష తినడం వలన గర్భిణులకు నీరు తగిన రీతిలో ఉంటుంది మరియు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
*స్ట్రాబెర్రీ లో ఉండే కార్బోహైహైడ్రాట్స్, విటమిన్స్ గర్భిణులకు తొందరగా శక్తిని అందజేస్తాయి.
*ఆపిల్ తినడం వలన గర్భిణులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆపిల్ ఒక ప్రోబయోటిక్ ఫుడ్.
*అరటిలో ఉండే పొటాషియం, ఫైబర్ కంటెంట్ వలన గర్భిణులకు మలబద్దకం రాకుండా ఉండేలా చేస్తుంది.
*కివి తినడం వలన గర్భిణులకు ఐరన్, ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా అందుతాయి.
*పుచ్చకాయలో ఉండే వాటర్ కంటెంట్ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండేలా చేస్తుంది.