Apple Slices : ఆపిల్ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
రోజూ ఒక ఆపిల్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు. అయితే పిల్లలకు, ఆఫీస్ కి వెళ్ళేవారికి బాక్స్ లో ఆపిల్ ముక్కలు పెట్టుకొని తీసుకెళ్తుంటారు కొంతమంది. ఒక్కొక్కసారి మిగిలిన ఆపిల్ ముక్కలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఆపిల్ ముక్కలు త్వరగా......................

Apple Slices : రోజూ ఒక ఆపిల్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు. అయితే పిల్లలకు, ఆఫీస్ కి వెళ్ళేవారికి బాక్స్ లో ఆపిల్ ముక్కలు పెట్టుకొని తీసుకెళ్తుంటారు కొంతమంది. ఒక్కొక్కసారి మిగిలిన ఆపిల్ ముక్కలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఆపిల్ ముక్కలు త్వరగా నల్లగా అయిపోతుంటాయి. యాపిల్ గుజ్జులోని పాలీఫినోల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి ఆపిల్ ముక్కలను బ్రౌన్ లేదా బ్లాక్ కలర్‌లోకి మారుస్తుంది. ఇలా కలర్ మారిన ఆపిల్ ముక్కలు తినడానికి అంత తొందరగా ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఆపిల్ ముక్కలు కలర్ మారకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు.
ఆపిల్ ముక్కలను కోసిన తరువాత తినకపోతే మిగిలిన వాటిని కొంచెం సేపు ఐస్ వాటర్లో ఉంచితే కొద్ది సమయం పాటు ఆపిల్ ముక్కలు ఫ్రెష్ గా ఉంటాయి. ఆపిల్ ముక్కలను కోసిన తరువాత జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచి వాటిని ఫ్రిజ్ లో పెట్టాలి. అప్పుడు ఆపిల్ ముక్కలు నల్ల బడకుండా ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఆపిల్ ముక్కలపై జల్లడం వలన కూడా ఆపిల్ ముక్కలు నల్లగా మారవు. లేదా ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ నిమ్మకాయ రసాన్ని బాగా కలిపి దానిలో కొంచెం సేపు ఆపిల్ ముక్కలను ఉంచి ఆ తరువాత తీయాలి. ఇలా చేయడం వలన కూడా ఆపిల్ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. ఆ తర్వాత కడుక్కొని తినవచ్చు, అప్పుడు దానికి అంటుకునే పులుపు మనకు తెలియదు.
Idly Batter : ఫ్రిడ్జ్ లేకుండా ఇడ్లీ పిండి, అట్ల పిండిని స్టోర్ చేయడం ఎలా ?
ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనెను వేసి బాగా కలపాలి. ఆ నీటిలో ఆపిల్ ముక్కలను కాసేపు ఉంచి తీసిన ఆపిల్ ముక్కలు రంగు మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పును కలిపి అందులో ఆపిల్ ముక్కలను రెండు నిముషాలు ఉంచినా కూడా ఆపిల్ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. దాల్చిన చెక్క పొడిని ఆపిల్ ముక్కలపై జల్లడం వలన ఆపిల్ ముక్కలు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఈ టిప్స్ ఫాలో అయినా తర్వాత తినే ముందు ఆపిల్ ముక్కలని నీట్ గా కడుక్కొని తినాలి. ఇలా చేయడం వల్ల ఆపిల్ ముక్కలు తొందరగా కలర్ మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి.