Sri Ramanavami Panakam : శ్రీరామనవమి స్పెషల్ పానకం.. ఇలా తయారుచేసుకోండి..
శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మొదట రాముని కళ్యాణం అయితే ఆ తర్వాత పానకం. శ్రీరామనవమికి పానకం అంటే అంత స్పెషల్.......................

Sri Ramanavami Panakam : శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మొదట రాముని కళ్యాణం అయితే ఆ తర్వాత పానకం. శ్రీరామనవమికి పానకం అంటే అంత స్పెషల్. ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చ్ 30న గురువారం నాడు వచ్చింది. ఆ రోజున అందరూ కూడా శ్రీరాముని కల్యాణాన్ని వీక్షించి పానకం తాగుతారు. శ్రీరాముని కళ్యాణం తెలుగు సంవత్సరాది మొదలైన తరువాత జరిగే మొదటి కళ్యాణం. శ్రీరాముని కళ్యాణం జరిగిన తరువాతే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. శ్రీరామనవమి నాడు అందరూ కూడా ఇళ్లల్లో పానకం, వడపప్పు, చలిమిడి చేసుకుంటారు.
పానకం తయారీకి కావలసిన పదార్థాలు:-
* బెల్లం 100 గ్రాములు
* మిరియాలు కొన్ని
* యాలకులు 2
* నీళ్లు అర లీటరు
మిరియాలను యాలకులు దంచుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇక గిన్నెలో నీటిని తీసుకొని దానిలో బెల్లం వేసి కరిగిన తరువాత జాలితో ఇంకొక దానిలో వడబోసుకోవాలి. ఇలా చేస్తే ఏదయినా డస్ట్ ఉన్నా పోతుంది. ఇప్పుడు దీనిలో దంచుకొని ఉంచుకున్న యాలకులు, మిరియాలను వేసుకోవాలి. పానకం రెడీ అయినట్లే. తీపికి సరిపడా నీళ్లు పోసుకోవచ్చు. ఇక కూలింగ్ కావలి అనుకుంటే ఈ పానకాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తాగొచ్చు.
Bobbatlu : ఉగాది స్పెషల్ బొబ్బట్లు.. ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి..
శ్రీరామనవమికి ప్రతి గుళ్లో పానకం కచ్చితంగా పోస్తారు. మన పెళ్ళిళ్ళల్లో కళ్యాణమండపంలో వరుడు రాగానే వారికి వధువు తరపు బంధువులు వచ్చి పానకాన్ని ఇస్తారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. శ్రీరామనవమి నాడు పానకంతో పాటు వడపప్పు, చలిమిడి కూడా పంచుతారు.