Sitting on Floor : నేలపై కూర్చుంటే ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??
ఇప్పుడు అందరూ ఎక్కువగా కుర్చీలు, మంచాలు, రొటేటబుల్ సీట్స్ వంటి వాటి మీద కూర్చుంటున్నారు. లా కూర్చొని పని చేయడం, మాట్లాడటం వల్ల అందరికి మీద నొప్పి, నడుం నొప్పులు వస్తున్నాయి. పాత కాలంలో నేల మీద..........

Sitting on Floor : ఇప్పుడు అందరూ ఎక్కువగా కుర్చీలు, మంచాలు, రొటేటబుల్ సీట్స్ వంటి వాటి మీద కూర్చుంటున్నారు. లా కూర్చొని పని చేయడం, మాట్లాడటం వల్ల అందరికి మీద నొప్పి, నడుం నొప్పులు వస్తున్నాయి. పాత కాలంలో నేల మీద లేదా ఇంటి ముందు అరుగుల మీద కూర్చునేవారు. ఇలా నేల మీద కూర్చోవడం వలన కూడా మనకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
*నేల మీద కూర్చోవడం వలన వెన్నుముక వంగిపోకుండా స్ట్రయిట్ గా ఉంటుంది.
*నేలపై కూర్చోవడం వలన తుంటి కండరాలు బలంగా తయారవుతాయి. వీటి వలన చక్కగా నడిచేందుకు, ఎక్కువసేపు నిలబడడానికి సహాయపడుతుంది.
*ఎక్కడైనా తొందరగా కూర్చొని నించోవాలి అన్నా నడుముకి పని పడుతుంది. ఎక్కువసేపు మనం నేల మీద కూర్చోవాలి అప్పుడే మన నడుము బాగా పని చేస్తుంది.
*ప్రివెంటింగ్ కార్డియాలజీ జర్నల్ లోని అధ్యయనం ప్రకారం నేల మీద ఎవరైతే ఎక్కువగా కూర్చుంటారో వారు ఎక్కువ కాలం జీవిస్తారు అని తెలిసింది.
*కుర్చీలలో కుర్చునేవారికి ఎక్కువగా భుజం నొప్పి, మెడ నొప్పి, నడుం నొప్పి వస్తుంటాయి. కానీ నేల మీద కుర్చునేవారికి అలాంటి నొప్పులు తొందరగా రావు.
*నేలపై కూర్చోవడం వలన కండరాలు చురుకుగా తయారవుతాయి.
*నేలపై కూర్చోవడం వలన మన శరీరంలోని అన్ని అవయవాలు కూడా కదులుతాయి. దాని వలన అన్ని అవయవాలు చురుకుగా తయారవుతాయి.
*నేలపై ప్లేట్ ఉంచి మనం కూడా నేలపై కూర్చొని ముందుకు వెనుకకు కదులుతూ తినడం వలన మన శరీరంలోని అన్ని అవయవాలు కదులుతాయి. తిన్న ఆహరం తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి నేల మీద కూర్చొని తినాలి.
*ల్యాప్ టాప్ తో పని చేసేవాళ్ళు కూడా చిన్న టేబుల్ పెట్టుకొని నేల మీద కూర్చొని చేస్తే మంచిది.