Lipstick : ఆడాళ్ళు.. లిప్‌స్టిక్ తెగ వాడేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

Kaburulu

Kaburulu Desk

September 17, 2022 | 01:29 PM

Lipstick : ఆడాళ్ళు.. లిప్‌స్టిక్ తెగ వాడేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

Lipstick :  సాధారణంగా ఎవరికైనా అందాన్ని తెచ్చేది చిరునవ్వు. ఆడవాళ్ళకి కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది అదే చిరునవ్వు. అది మరింత అందంగా కనబడడానికి, నవ్వినప్పుడు పెదవులు మెరవడానికి, పెదవులు అందంగా కనపడటానికి చాలా మంది మహిళలు లిప్‌స్టిక్ వాడతారు. ఇటీవల చాలా మంది రోజూ లిప్‌స్టిక్ ని వాడుతున్నారు. అందం కోసం లిప్‌స్టిక్ రాసుకుంటున్నారు కానీ లిప్‌స్టిక్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా??

*లిప్‌స్టిక్ లో క్రోమియం, మెగ్నీసియం, లెడ్, కాడ్మియం, పెట్రో వంటి కెమికల్స్ వాడుతుంటారు. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
*లిప్‌స్టిక్ లో వాడే లెడ్ కెమికల్ అనేది నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది.
*లిప్‌స్టిక్ లో వాడే కాడ్మియం అనే కెమికల్ వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.
*లిప్‌స్టిక్ లో వాడే పెట్రో కెమికల్ వలన తెలివితేటలు మందగిస్తాయి. చర్మం బాగా ఇరిటేట్ అవడం జరుగుతుంది.

Copper Vessel Water : రాగి పాత్రల్లో నీరు ఎందుకు త్రాగుతారో తెలుసా..?

లిప్‌స్టిక్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల ఇవే కాక మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆడవారు రోజూ లిప్‌స్టిక్ వాడటం తగ్గిస్తే మంచిది. ఎపుడైనా పార్టీలు, ఫంక్షన్స్, అకేషన్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడితే పర్లేదు కానీ రోజూ అంటే జాగ్రత్త కావాల్సిందే. లిప్‌స్టిక్ బదులు రెగ్యులర్ గా పెదాలకు వెన్న లేదా నెయ్యి రాసుకుంటే కూడా చాలా స్మూత్ గా కనిపిస్తాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. పెదవులకి నెయ్యి రాసినా కూడా మెరుపు ఉంటుంది.