Numbness : మీకు తిమ్మిర్లు రెగ్యులర్ గా వస్తున్నాయా.. వీటికి కారణమేంటో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 06:42 PM

Numbness : మీకు తిమ్మిర్లు రెగ్యులర్ గా వస్తున్నాయా.. వీటికి కారణమేంటో తెలుసా??

Numbness :
ఇటీవల కాలంలో తిమ్మిర్ల సమస్య పెద్ద వారితో పాటు నడి వయస్కులలో, యువతరంలో కూడా చూస్తున్నాం. దీనికి గల కారణాలు మనం తినే ఆహారంలో లోపించే పోషకాలు, అలాగే మన నరాల పనితీరు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం చాలా మందికి అనుభవమే. కాసేపు అటు ఇటు నడవగానే తొలగిపోతాయి. అలాకాకుండా కొంతమందికి కాళ్లల్లో తిమ్మిర్లు చురుక్కుమనే పోట్లు వస్తుంటాయి. వస్తువులను పట్టుకొలేకపోతారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది.

మెదడుకు మన శరీరానికి కొన్ని నరాల కనెక్షన్లు ఉంటాయి. మెదడు, తన ఆదేశాలతో అన్ని అవయవాలు కండరాల కదలికలను నియంత్రించేది. ఆ నరాల కనక్షన్లు ఏ పని చేయాలన్నా నరాల వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండాలి. అలా విస్తరించి ఉన్న నరాల్లో కాళ్లు చేతుల్లో ఉండే కొన్నింటిని పెరిఫెరల్ నరాలు అంటారు. ఆ నరాలు దెబ్బ తినడం వల్ల కనిపించే ఈ తిమ్మిరి లక్షణాలనే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్య వల్లే ఎక్కువగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.

Also Read……………..    Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎంత లాభమో తెలుసా??

మన శరీరంలో విటమిన్ బి12, మెగ్నీషియం వంటి పోషకాలు లోపించినా కూడా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఈ విటమిన్ నీటిలో కరిగే విటమిన్. తగినంత విటమిన్ బి12 తీసుకోకపోతే నరాల సంబంధించిన ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకు గల పరిష్కారం రోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో రెండు స్పూన్స్ ఆపిల్ సైడ్ వెనిగర్ ను కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ విటమిన్ లోపాన్ని సరిచేసే ఆహారాన్ని కూడా సమృద్ధిగా తీసుకుంటే తిమ్మిర్ల సమస్య నుంచి బయటపడొచ్చు.