Children’s : ఈ వస్తువులు పిల్లల దగ్గర ఉంచకూడదు.. పిల్లల రూముల్లో కూడా ఉంచకండి..

పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వారి రూమ్ లో మనం కొన్ని వస్తువులను ఉంచకూడదు. వాటి వలన పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటివి పిల్లలకు దూరంగా ఉంచాలి..............

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 04:00 PM

Children’s : ఈ వస్తువులు పిల్లల దగ్గర ఉంచకూడదు.. పిల్లల రూముల్లో కూడా ఉంచకండి..

Children’s :  పాత కాలంలో అందరూ కలిసి ఒకే చోట ఉండేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లలకు ఒక రూమ్ దానిలో వాళ్లకు ఇష్టమైనవి అన్నీ ఉంచుతున్నారు. లేదా చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ అయినా పిల్లలకి కావాల్సినవి అన్నీ సమకూర్చుతున్నారు. అయితే పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వారి రూమ్ లో మనం కొన్ని వస్తువులను ఉంచకూడదు. వాటి వలన పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటివి పిల్లలకు దూరంగా ఉంచాలి.

*పిల్లలు ఎక్కువసేపు బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. అయితే వాటిలో ఎక్కువ శబ్దం వచ్చే వాటిని ఉంచకూడదు. వాటి వలన చెవులకు ప్రమాదం కలుగుతుంది.
*పిల్లల రూమ్ లో పెద్ద సైజు సోఫాలు, కదులుతూ ఉండే సోఫాలు, గోడకు బిగించనివి ఉంచరాదు. ఎందుకంటే వాటిపై ఎక్కి తొక్కుతుంటే పిల్లలపై అవి పడి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది.
*షార్ప్ గా ఉన్న అంచులు కలిగిన వస్తువులను పిల్లల గదిలో ఉంచకూడదు. దీని వలన కూడా పిల్లలకు దెబ్బలు తగులుతాయి.
*తుప్పు పట్టిన కిటికీ ఊచలు, లేదా కిటికీకి ఉంచిన తుప్పు పట్టిన మెస్ లు పిల్లలు రూమ్ లో ఉంటే తీసెయ్యాలి. లేకపోతే అవి చేతులకు కోసుకుపోతుంటాయి.
*విద్యుత్ వైర్లు బయటకు వచ్చినవి లేదా వాటికి ప్లాస్టర్స్ వేసి ఉన్నట్లైతే వాటిని ముందుగా బాగు చేయించుకోవాలి. పిల్లలకు చిన్నప్పుడు అందవు కానీ పెరుగుతున్న కొద్దీ అన్నీ ముట్టుకోవాలని వాటిని రిపేర్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మనమే ముందుగా జాగ్రత్తపడాలి. అలాంటి వైర్లు ఏమన్నా ఉంటే పైకి, లేదా కనపడకుండా ఉంచాలి.
*పండుగ సమయాల్లో లేదా పుట్టినరోజు వేడుకల సమయాల్లో ఇంటి మొత్తాన్ని డెకరేట్ చేయడానికి కలర్ లైట్లు వాడుతుంటారు. కాబట్టి వాటిని పిల్లలు గదిలో డెకరేట్ చేయవద్దు. వాటి వలన పిల్లల కళ్ళకు ఇబ్బంది కలుగుతుంది.
*పిల్లలు టీవీకి ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు. కాబట్టి పిల్లల రూమ్ లో కాకుండా హాల్ లోనే టీవీ పెట్టుకోవాలి. అప్పుడు పిల్లలు ఎక్కువ టైం టీవీ చూడరు. అదే వాళ్ళ రూమ్ లో టీవీ ఉంటే ఎక్కువసేపు టీవీ చూసే అవకాశం ఉంది.
*మనం వాడుకునే మందులు లేదా కెమికల్స్ కలిపిన పదార్థాలను పిల్లల గదిలో ఉంచరాదు. ఎందుకంటే పిల్లలు మనకు తెలియకుండా వాటిని తినే ప్రమాదం ఉంది.
*ఛార్జింగ్ సాకెట్స్ పిల్లలకు అందనంత ఎత్తులో ఉండేలా చేయాలి. లేకపోతే వాటిలో పిల్లలు వేళ్ళు పెట్టె అవకాశం ఉంది.
*పిల్లలు ఉండే రూమ్ లో అద్దం పెట్టకూడదు. ఎందుకంటే పిల్లలు దానిని కింద పడేసి వారికి కూడా దెబ్బలు తగిలే ప్రమాదం, అవి గుచ్చుకునే ప్రమాదం ఉంది.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పిల్లల రూమ్ లో ఉంచకూడని వస్తువులను తీసేసి పిల్లల ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కాపాడుకుందాం.