China : ప్రపంచానికి కొత్త వరి పరిచయం చేయబోతున్న చైనా.. ఇక ఆకలి బాధలు ఉండవు..

Kaburulu

Kaburulu Desk

December 5, 2022 | 08:52 PM

China : ప్రపంచానికి కొత్త వరి పరిచయం చేయబోతున్న చైనా.. ఇక ఆకలి బాధలు ఉండవు..

China :  ప్రపంచంలో ఆహారకొరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆహారకొరత వలన సుమారు సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది దాక చనిపోతున్నారు. మన దేశంలో ఎంత బాగా వరి పండించిన ఎకరానికి సుమారు 15 నుండి 20 క్వింటాళ్లు మించదు. అందులోను వానలు సక్రమంగా పడి ఎటువంటి తుఫాన్లు ఏమి లేకపోతేనే అంత పంట దిగుబడి వస్తుంది. కానీ ఏదయినా తుఫాన్లు వచ్చిన లేదా ఏమైనా వానలు కురవాల్సిన సమయంలో కురవకపోయిన పంట దిగుబడి తగ్గుతుంది.

అయితే ఈ సమస్యను అధిగమించడానికి చైనా దేశంలో కొత్తగా వరి వంగడాలను కనిపెట్టారు. వాటితో ఒక్కసారి వరి నాటితే నాలుగు సంవత్సరాల పాటు అంటే ఎనిమిది సీజన్ లు కోత కోసుకోవచ్చు. దానికి “పిఆర్ 23 ” అని పేరు పెట్టారు. ఈ రకమైన వరి నాటితే ఇది ఎకరానికి 27 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది అంటే మాములు వరితో పోలిస్తే 7 క్వింటాళ్లు ఎక్కువ. అందులోను ఈ పంటపై ఎటువంటి పురుగులు ఎక్కువగా వాలవు కాబట్టి ఎక్కువ క్రిమిసంహారక మందులు కూడా వాడవలసిన అవసరం లేదు.

Food for Suger patients : షుగర్ పేషెంట్స్ ఆహారంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

ఈ పంటలో నారు పోసిన 25 రోజుల్లో నాటుకోవచ్చు. ఈ పంటలో కోత కోయడం అయిన తరువాత నీరు పడితే అవే పిలకలపై మళ్ళీ పైరు వస్తుంది. కాబట్టి ప్రతిసారీ ఖర్చు పరంగా చూస్తే చాలా ఖర్చు తగ్గినట్లు అవుతుంది. ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ కాబట్టి అన్ని దేశాలు కూడా చైనా దేశంలో కనిపెట్టిన వరి వంగడాల కోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ళు సొంతంగా తయారుచేయాలని చూస్తున్నారు. చైనాలో ఇది చివరి దశ ప్రయోగాల్లో ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఈ వరి వంగడం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే రైతులకు నష్టం కలిగే అవకాశం చాలా తక్కువ. ఆహార కొరత వలన మరణించే వారి సంఖ్య కూడా తగ్గుతుంది.