Jeera Water : జీలకర్ర నీరు ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా??

Kaburulu

Kaburulu Desk

September 30, 2022 | 03:27 AM

Jeera Water : జీలకర్ర నీరు ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా??

Jeera Water :  జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. తాలింపు వేస్తే కచ్చితంగా జీలకర్ర ఉంటుంది. జీరా రైస్ అని కూడా ఇటీవల తింటున్నాము. విరివిగా దొరికే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అనేక గృహ చికిత్సల్లో కూడా జీలకర్ర వాడుతూ వుంటారు.

జీలకర్రతో పాటు జీలకర్ర నీరు కూడా ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర నీరు ఇటీవల బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మనమే తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు, ఒక స్పూన్ జీలకర్రను వేసి స్టవ్ మీద 5నిమిషాలు మరిగించిన తర్వాత ఆ నీళ్ళని వడపోసి ఉంచుకోవాలి. జీలకర్ర నీటిని గోరువెచ్చగా పరగడుపున తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.

Munagaku : మునగాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

జీలకర్ర నీరు తాగడం వల్ల లాభాలు :

*జీర్ణాశయం ఇబ్బందులు తొలిగిపోతాయి.
*వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
*చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
*అసిడిటీ తగ్గుతుంది.
*ఊపిరితిత్తుల ఇబ్బందులు తొలిగిపోతాయి .
*మధుమేహం, రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
*బరువు తగ్గడానికి కూడా జీరా వాటర్ ఉపయోగపడుతుంది.

కాబట్టి జీలకర్ర నీటిని రోజూ పరగడుపున తాగి ఆరోగ్యంగా ఉండండి.