Pickel : డైలీ పచ్చడన్నం తింటున్నారా? అయితే జాగ్రత్త..

Kaburulu

Kaburulu Desk

October 25, 2022 | 08:37 AM

Pickel : డైలీ పచ్చడన్నం తింటున్నారా? అయితే జాగ్రత్త..

Pickel :  ఊరగాయ లేనిదే మనం తినే భోజనం సంపూర్ణం కాదు. ముఖ్యంగా భారతదేశంలో చాలామందికి కచ్చితంగా పచ్చడి అన్నం ఉండాల్సిందే రోజూ. ప్రతి ఇంట్లోనూ రకరకాల ఊరగాయలు చేసి నిల్వ ఉంచుకుంటారు. సంవత్సరం అంతా ఆ ఊరగాయని ఆస్వాదిస్తూ తింటారు. అయితే ఎక్కువ శాతంలో ఊరగాయలు తీసుకుంటే శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊరగాయ ఎక్కువగా తింటే పలు ఆరోగ్య సమస్యలు దరిచేరడం ఖాయం అంటున్నారు.

*ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అధిక శాతంలో నూనెను వాడతారు. అలాగే ప్యాక్ చేసినా ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నూనెతో పాటు ఉప్పు ఎక్కువగా వేస్తారు. దాంతో మన శరీరం అనారోగ్యం బారినపడుతుంది.

*ఊరగాయలలో ఎక్కువగా ఉండే ఉప్పు, కారం, నూనె కారణంగా జీర్ణాశయ సమస్యలు ఎదురవుతాయి.

*మొలల సమస్య ఉన్న వాళ్లు పచ్చళ్ళకు దూరంగా ఉండటం ఉత్తమం. ఊరగాయలలో ఎక్కువగా ఉండే కారం, ఘాటు పదార్థాలు ఫైల్స్ సమస్యను మరింతగ పెంచుతుంది.

*ఊరగాయలను ఎక్కువగా తీసుకుంటే పొట్టలో, పేగులలో అల్సర్ సమస్యలు వస్తాయి. ఉరగాయలలో ఉండే ఎక్కువ కారం అల్సర్ సమస్యలకు కారణం అవుతుంది.

అందుకని పచ్చడన్నం మితంగా తింటే పర్వాలేదు కానీ అమితంగా డైలీ ఊరగాయలు వేసుకొని తింటే మాత్రం పలు ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ఊరగాయలు ఎక్కువగా తినేవాళ్లు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది