Ice creams : చలికాలంలో ఐస్ క్రీమ్స్ తినవచ్చా??

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 07:00 PM

Ice creams : చలికాలంలో ఐస్ క్రీమ్స్ తినవచ్చా??

Ice creams :  చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ ను ఇష్టపడని వారు ఉండరు. ఐస్ క్రీమ్ తినడానికి వయస్సు ఏ మాత్రం అడ్డు రాదు. ఐస్ క్రీమ్ లో పాలు, చాక్లెట్ అనేక రకాల డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ వంటివి వాడతారు ఇవన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించినా ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో వాడే చక్కెర కేలరీలు కొవ్వును కలిగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కాకపోయినా ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఐస్ క్రీమ్ లు రెగ్యులర్ గా తింటే బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక వేసవిలో దీని డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిసిందే.

అయితే చాలా మందికి చలికాలంలో ఐస్ క్రీమ్ తినొచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది.

*శీతాకాలంలో వీలైనంతవరకు ఐస్ క్రీమ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది జలుబుకు కారణం అవుతుంది. ముఖ్యంగా సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఐస్ క్రీమ్ చాలా హానికరం.
*బలహీనమైన రోగనిరోధక నిరోధకశక్తి ఉన్న పిల్లలు, పెద్ద వారు ఐస్ క్రీమ్ కి దూరంగా ఉండాలి.
*మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఐస్ క్రీమ్ కి దూరంగా ఉండాలి.
*ఒకవేళ చలికాలంలో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే రాత్రి వేళ కాకుండా సాయంత్రం తినమంటున్నారు నిపుణులు.
*అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గొంతు నొప్పి లేదా జలుబు ఇతర లక్షణాలు ఉంటే వేడి నీరు లేదా అల్లం టీ తాగమని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.