Mosquitoes : ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా?? దోమలను తరిమికొట్టడానికి ఈ చిట్కాలు పాటించండి..

సాయంత్రం అయితే చాలు మన ఇంటి నిండా దోమలు ఎక్కడినుండి అయినా వచ్చేస్తాయి. ఇంకా చలికాలం, వానాకాలం ఎక్కువగా వస్తుంటాయి. వాటిని పోగొట్టడానికి మనం ఆల్అవుట్, జెట్ కాయిల్స్, అగరబత్తి.. ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తుంటాము. అయినా కూడా దోమలు..............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 01:00 PM

Mosquitoes : ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా?? దోమలను తరిమికొట్టడానికి ఈ చిట్కాలు పాటించండి..

Mosquitoes :  సాయంత్రం అయితే చాలు మన ఇంటి నిండా దోమలు ఎక్కడినుండి అయినా వచ్చేస్తాయి. ఇంకా చలికాలం, వానాకాలం ఎక్కువగా వస్తుంటాయి. వాటిని పోగొట్టడానికి మనం ఆల్అవుట్, జెట్ కాయిల్స్, అగరబత్తి.. ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తుంటాము. అయినా కూడా దోమలు ఒక్కొక్కసారి అసలు పోవు. మనకు నిద్ర పట్టకుండా చేస్తుంటాయి. కాబట్టి దోమలను మన ఇంటి లోనికి రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.

లెమన్ గ్రాస్ అనేది ఎక్కువగా ఇళ్లల్లో సువాసన రావడం కోసం పెట్టుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఇంట్లో పెట్టుకోవడం వలన లెమన్ గ్రాస్ వాసనకు దోమలు కూడా రాకుండా ఉంటాయి.

వెల్లుల్లిని అందరూ కూడా ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు. అయితే వెల్లుల్లికి గల ఘాటు వాసనకు కూడా దోమలు మన ఇంటిలోనికి రావు. వెల్లుల్లిని కొద్దిగా మెదిపి దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి. వెల్లుల్లి ఎక్కువగా తిన్న వారిని కూడా దోమలు కుట్టవు. వెల్లుల్లి నుండి రసం తీసి దానిని ఒక బాటిల్ లో ఉంచి స్ప్రే చేయడం ద్వారా కూడా దోమలు మన ఇంటి నుండి దూరంగా పారిపోతాయి.

పిప్పరమెంట్ ఆయిల్ ని ఇంటిలో స్ప్రే చేయడం వలన దోమలు మన దగ్గరికి రావు. పిప్పరమెంట్ ఆయిల్ అనేది రూమ్ ఫ్రెష్నర్ గా కూడా పని చేస్తుంది.

తులసి ఆకులు కూడా దోమలు రాకుండా చేస్తుంది. తులసి ఆకులను మన ఇంటిలో అక్కడక్కడ పెట్టడం లేదా తులసి రసాన్ని ఒక బాటిల్ లో వేసి దానిని స్ప్రే చేయడం వలన కూడా దోమలు మన ఇంటిలోనికి రావు, వచ్చినా ఆ వాసనకు పారిపోతాయి.

Protein Food : శాకాహారులు మాంసాహారంలోని ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహరం తినాలో తెలుసా??

నీమ్ ఆయిల్ అంటే వేప నూనె దీనిని మనం చర్మానికి రాసుకోవడం వలన మనల్ని దోమలు కుట్టకుండా ఉంటాయి. లాగే నీమ్ ఆయిల్ తో ఇంటిని కడిగితే కూడా దోమలు రావు. కాబట్టి ఇలాంటి ఇంటి చిట్కాలను ఉపయోగించి ఇంటిలోని దోమలను తరిమికొట్టండి.