Snoring : గురక ఎక్కువ పెడుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

మనం పడుకున్నాక చాలామందికి గురక అనేది వస్తుంది. మనం పడుకున్నప్పుడు గొంతు వెనుక భాగం వదులై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది ఆ సమయంలో మెదడుకు శ్వాస తీసుకోవాలి అనే సంకేతాలు వెళతాయి. అప్పుడు........

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 07:00 PM

Snoring : గురక ఎక్కువ పెడుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

Snoring :  మనం పడుకున్నాక చాలామందికి గురక అనేది వస్తుంది. మనం పడుకున్నప్పుడు గొంతు వెనుక భాగం వదులై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది ఆ సమయంలో మెదడుకు శ్వాస తీసుకోవాలి అనే సంకేతాలు వెళతాయి. అప్పుడు గురక తీసుకునే పద్దతిలో శ్వాస తీసుకుంటారు. గురక వలన మనం పగలు అలసటగా, చిరాకుగా ఉంటాము ఇంకా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటాము కాబట్టి గురక పెడుతున్నారనే విషయం మనకు తెలిస్తే వారు గురకను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

*తల కింద వాడే దిండ్లు మెత్తగా ఉండేవి కాకుండా గట్టిగా ఉండేవి తల కింద పెట్టుకొని పడుకోవాలి. అప్పుడు కణజాలం ద్వారా గాలి తేలికగా ప్రవహిస్తుంది.
*పడుకునేటప్పుడు వెల్లకిలా కాకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. అప్పుడు గాలి బాగా ఆడుతుంది నిద్రలో వెల్లకిలా పడుకుంటే పక్కకు తిరిగి పడుకునేలా చేయమని మీ భాగస్వామికి చెప్పండి అప్పుడు గురక సమస్య తగ్గుతుంది.
*గురకను తగ్గించడానికి ఆవిరి పట్టవచ్చు, ఇలా చేయడం వలన శ్వాసనాళంలోని మ్యూకస్ ను బయటకు నెట్టివేయడం వలన నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. కాబట్టి మనకు శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్పుడు గురక రాదు.
*ధూమపానం చేసేవారికి గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. గురక తగ్గాలంటే ధుమపానం వంటివి చేయకూడదు.
*మద్యపానం అలవాటు ఉన్నవారు కూడా గురక తగ్గాలంటే ఆల్కహాల్ తాగడం మానేయాలి.
*జలుబు ఉన్నట్లైతే తొందరగా తగ్గేలా చూసుకోవాలి. జలుబు వల్ల మనం శ్వాస సరిగ్గా తీసుకోలేము కాబట్టి గురక ఎక్కువగా వస్తుంది.
*దగ్గు ఉన్న కూడా గురక వస్తుంది. వాటిని తొందరగా తగ్గించుకోవాలి.
*పడుకునే ముందు పిజ్జాలు, బర్గర్లు, చీజ్ పాప్కార్న్ వంటివి తినకూడదు ఇవి తింటే వీటిలో ఉండే కొవ్వు వలన మ్యూకస్ పేరుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయి గురక వస్తుంది.