Salt : కూరల్లో ఉప్పు ఎక్కువైందా?? ఇలా చెయ్యండి చాలు..

Kaburulu

Kaburulu Desk

November 30, 2022 | 09:26 AM

Salt : కూరల్లో ఉప్పు ఎక్కువైందా?? ఇలా చెయ్యండి చాలు..

Salt :  కూరలు చాలా బాగా రుచిగా ఉండాలంటే ముఖ్యమైన పదార్థం ఉప్పు. అది సరైన మోతాదులో ఉంటే కూర చాలా బాగుంటుంది. అది తక్కువైనా, ఎక్కువైనా కూర రుచి బాగోదు. అసలు ఏ వంటలోనైనా ఉప్పు కచ్చితంగా ఉంటేనే దానికి తగిన రుచి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎవ్వరికైనా కూరలో ఉప్పు ఎక్కువగా పడడం, తక్కువగా పడడం జరుగుతుంది. తక్కువైతే మళ్ళీ వేస్తే సరిపోతుంది. కానీ ఎక్కువైతే ఎలా అని కొంతమంది కంగారుపడతారు, ఆ కూరని పడేస్తారు కూడా.

కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే దానిని తగ్గించడానికి కూడా మనం కొన్ని చిట్కాలను వాడొచ్చు. పచ్చి బంగాళదుంపలను కొన్నింటిని కోసి వాటిని కూరలో వేస్తే అవి కూరలోని ఉప్పును తీసేస్తాయి లేదా ఉడికించిన బంగాళదుంపలను కూడా కూరలో వేసి కాసేపు ఉంచి తీసేస్తే కూరలోని ఉప్పు తగ్గుతుంది.

Depression : డిప్రెషన్ కి గురవుతున్నారా.. సంతానోత్పత్తి తగ్గడం ఖాయం…

అలాగే గోధుమపిండి లేదా మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో కాసేపు ఉంచి తీసేయాలి. అవి కూరలో ఎక్కువైనా ఉప్పుని లాగేసుకుంటాయి. ఇక సాధారణంగా ఎక్కువమంది కొంచెం కారం, నీళ్లు వేసి కాసేపు స్టవ్ మీద ఉంచి కూరని కలబెడతారు. ఇలా చేసినా కూడా కూరలో ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది. ఇంకా ఈజీగా అవ్వాలంటే కూరలో కొద్దిగా పెరుగు వేసి కలిపితే సరిపోతుంది. పెరుగు కూరలో ఉప్పును సరిచేయడమే కాకుండా కూరకు కూడా మంచి రుచిని తెస్తుంది.