Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 28, 2022 | 12:27 PM

Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..?

Gastric Problem :  ఇటీవల గ్యాస్ సమస్య అనేది వయసుతో సంభంధం లేకుండా ఇప్పుడు అందరికి వస్తుంది. గ్యాస్ వస్తే ఛాతిలో నొప్పి, కడుపులో మంట వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ రావడానికి మనం తినే ఆహారమే కారణం. కారం, పులుపు, ఉప్పు వంటి వాటిని మనం మోతాదుకు మించి తింటే అది జీర్ణం కాకపోతే కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అదే గ్యాస్ రూపంలో మనకు నొప్పిని కలిగిస్తుంది.

గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తే తగ్గించుకోవడానికి ఎండోస్కోపీ చేయించుకుంటారు కొంతమంది. ఆహరం పరంగా చూస్తే గ్యాస్ నొప్పి తగ్గడానికి మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఫ్రెష్ మజ్జిగ తాగాలి పుల్లటి మజ్జిగ తాగకూడదు. వాము నీళ్ళు తాగినా కూడా గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది. వాము అన్నం కూడా తినవచ్చు. మనం తినే వాటిలో మసాలాలు ఎక్కువగా లేకుండా ఉండేలా చూసుకోవాలి.

Eating Chicken : కోడి మాంసం రోజూ తింటున్నారా?? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు..

ఉడకని కూరగాయలు అంటే పచ్చి కూరగాయలు తింటే మనకు ఎంతో మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వలన గ్యాస్ రాకుండా ఉండేలా జాగ్రత్తపడవచ్చు. రాత్రిపూట పప్పు, సాంబార్, బిర్యానీ..లాంటివి తినకపోవడమే మంచిది. పడుకునేటప్పుడు ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. తల కింద దిండు ఉండేలా చూసుకోవాలి. మనకు గ్యాస్ రాకుండా ఉండడానికి ఆహరం పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిది.