Sakinaalu : సంక్రాంతికి సకినాలు ఇలా తయారు చేసుకోండి..

సంక్రాంతి అనగానే తెలంగాణలో వండుకునే పిండి వంటలు ముఖ్యంగా సకినాలు, అరిసెలు. ఇవి రెండు ఆరోగ్యానికి మంచివి మరియు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. వీటిలో సకినాలు ఎలా తయారు చేసుకోవాలో...........

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 07:41 PM

Sakinaalu : సంక్రాంతికి సకినాలు ఇలా తయారు చేసుకోండి..

Sakinaalu :  సంక్రాంతి అనగానే తెలంగాణలో వండుకునే పిండి వంటలు ముఖ్యంగా సకినాలు, అరిసెలు. ఇవి రెండు ఆరోగ్యానికి మంచివి మరియు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. వీటిలో సకినాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.

సకినాలు తయారీకి కావాల్సిన పదార్థాలు:-

*తడి బియ్యం పిండి kg (పాత బియ్యం ఒకరోజు మొత్తం నానబెట్టిన తరువాత ఆ బియ్యాన్ని ఆరబెట్టిన తరువాత పిండి ఆడించాలి)
*తెల్ల నువ్వులు కొన్ని
*పచ్చిమిర్చి కొన్ని లేదా కారం
*ఉప్పు రుచికి సరిపడా
*వాము కొద్దిగా

ముందుగా బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒక గిన్నెలో మొదటగా జల్లించిన బియ్యం పిండిని తీసుకొని దానిలో తెల్ల నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎన్ని కావాలనుకుంటే అన్నింటిని కచ్చా పచ్చగా దంచుకోవాలి లేకపోతే మీరు కారం వేసుకోవాలని అనుకుంటే ఎంత కారం సరిపోతుందో దానికి అంత కారాన్ని పచ్చిమిర్చికి బదులుగా కలుపుకోవాలి. అప్పుడు దానిని కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు గనక పడితే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు.

ఇలా తయారైన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుటూ ఉండాలి మరీ గట్టిగ కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. అలా కలిపినా దానిని ఒక పదిహేను నిముషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఆ తరువాత ఒక కాటన్ క్లాత్ ని పరిచి దాని మీద చేతితో పిండిని మెలి తిప్పుకుంటూ రౌండ్ షేప్స్ లో మూడు చుట్లు చుట్టుకోవాలి. ఇంకా మీకు ఏ రకమైన షేప్స్ కావాలని అనుకుంటారో ఆ షేప్స్ లో చేసుకోవచ్చు. ఉదాహరణకు పలక, బలపం, రోలు, రోకలి మురుకు ఇంకా చాలా రకాల షేప్స్ లో చేసుకోవచ్చు. పిల్లలకు కావాల్సిన, ఇష్టమున్న షేప్స్ కూడా చేసుకోవచ్చు.

Importance Sankranthi Gangireddu: సంక్రాంతి పండుగనాడు ఆడించే గంగిరెద్దుల ప్రత్యేకతలేంటో తెలుసా…?

వీటన్నింటిని ఆ కాటన్ క్లాత్ పైనే ఆరేవరకు ఉంచాలి. కాసేపు ఆరిన తరువాత సరాతంతో ఒక్కొక్క సకినాన్ని తీసుకొని ప్లేట్ పై పెట్టుకోవాలి అవి విడిపోకుండ చూసుకోవాలి. పొయ్యి మీద ఒక మూకుడులో నూనెను బాగా వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో సకినాలు నాలుగు లేదా ఐదింటిని ఒకేసారి వేసి బాగా వేయించుకోవాలి. అప్పుడు మీకు కరకరలాడే సకినాలు రెడీ అయితే వీటిని మాములుగా తినవచ్చు. అలాగే దానికి ఉల్లి కారం పెట్టుకొని కూడా తినొచ్చు.