Ariselu : సంక్రాంతికి అరిసెలు ఇలా తయారుచేసుకోండి..

సంక్రాంతి పండగ రాగానే మన అందరికీ గుర్తుకు వచ్చేవి పిండివంటలు. అందులో ముఖ్యంగా అరిసెలు. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఇవి సాంప్రదాయానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా.....................

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 08:10 PM

Ariselu : సంక్రాంతికి అరిసెలు ఇలా తయారుచేసుకోండి..

Ariselu :  సంక్రాంతి పండగ రాగానే మన అందరికీ గుర్తుకు వచ్చేవి పిండివంటలు. అందులో ముఖ్యంగా అరిసెలు. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఇవి సాంప్రదాయానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచివి. అందరికి ఇష్టమైన అరిసెలు ఎలా ఈజీగా తయారు చేయాలో తెలుసుకుందాము.

అరిసెల తయారీకి కావలసిన పదార్థాలు:-
* అరిసెల బెల్లం 650 గ్రాములు
* పంచదార 100 గ్రాములు
* kg 1 /4 బియ్యం
* నువ్వులు

బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టాలి. ఆ బియ్యాన్ని ఆరబెట్టిన తరువాత పిండి ఆడించాలి. అలా వచ్చిన బియ్యం పిండిని జల్లించాలి. పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొయ్యి మీద ఒక గిన్నెలో బెల్లం మరియు పంచదార కలిపి కొద్దిగా నీరు పోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడబోయాలి. అలా వడబోసిన బెల్లాన్ని పాకం వచ్చేవరకు మళ్ళీ కరిగించాలి. మీరు పంచదార కలపకూడదు అనుకుంటే మొత్తం బెల్లం కూడా తీసుకోవచ్చు అప్పుడు పంచదార కి బదులుగా ఇంకొక వంద గ్రాములు బెల్లం ఎక్కువ తీసుకోవాలి.

బెల్లం పాకం రెడీ అయ్యాక గిన్నెను కిందకు దించి దానిలో బియ్యం పిండిని పోసి ఉండలు రాకుండా మరీ గట్టిగ కాకుండా కలుపుతూ ఉండాలి. అలా మెత్తటి చలిమిడి రెడీ అవుతుంది. దాంట్లో నువ్వులు మనకి కావాల్సినంత వేసుకోవాలి.

Sakinaalu : సంక్రాంతికి సకినాలు ఇలా తయారు చేసుకోండి..

ఆ తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు తీసుకొని దానిలో నూనె వేసుకొని కాగించాలి. ఒక నూనె కవర్ మీద ఆ అరిసెల చలిమిడి పిండిని రౌండ్ గా చేసుకొని దానిని కాగిన నూనెలో వేయాలి. అలా వేగిన అరిసెలని గట్టిగా ఒత్తితే అరిసెలలోని నూనె బయటకు వస్తుంది. ఆరేసిలు వేడి తగ్గేవరకు ఒకదాని మీద కటి వేయకుండా ఉంటె మెత్తటి అరిసెలు రెడీ అవుతాయి.