Cleaning Mixer Jars : మిక్సీ‌జార్‌లు సరిగ్గా క్లీన్ అవ్వట్లేదా??.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

 ఈ రోజుల్లో మిక్సీ, గ్రైండర్లు లేని ఇల్లే లేదు. కానీ వాటిని శుభ్రం చేసుకోవడం ఒక పెద్ద సమస్య. ఎంత బాగా శుభ్రం చేసినా, అక్కడక్కడా మరకలతో.........

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 10:00 PM

Cleaning Mixer Jars : మిక్సీ‌జార్‌లు సరిగ్గా క్లీన్ అవ్వట్లేదా??.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Cleaning Mixer Jars :  ఈ రోజుల్లో మిక్సీ, గ్రైండర్లు లేని ఇల్లే లేదు. కానీ వాటిని శుభ్రం చేసుకోవడం ఒక పెద్ద సమస్య. ఎంత బాగా శుభ్రం చేసినా, అక్కడక్కడా మరకలతో మురికిగా ఉంటాయి. ఈ మురికి మరకలు కొన్ని సార్లు పసుపు రంగులో ఉండి ఒక పట్టాన వదలవు. అవి నెక్స్ట్ టైం మిక్సీ పట్టినప్పుడు మరింత ఇబ్బందిగా మారుతాయి. మనం ఎంత క్లీన్ చేసినా కొన్ని మరకలు అలాగే ఉండిపోతాయి. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మిక్సీ జార్ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు.

ఈ టిప్స్ వాడి మిక్సీ జార్ లని ఈజీగా శుభ్రపరుచుకోండి..

* బేకింగ్ పౌడర్ న్యాచురల్ క్లీనర్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను వేసి పేస్ట్ లా తయారు చేసి, జార్ లోపల బయట రాయండి. కాసేపటికి నీటితో శుభ్రం చేస్తే మరకలు పోవడమే కాకుండా దాని నుంచి వచ్చే వాసన కూడా పోతుంది. ఇది మురికి, మచ్చలు తొలగించడానికి ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
*జార్ క్లీనింగ్ కోసం జార్ లో కొంత శానిటైజర్ ని వేసి మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ ను సాధారణ నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మరకలు పోవడంతో పాటు ఘాటైన వాసన కూడా పోతుంది.
*నిమ్మ తొక్కలకు వాడి కూడా జార్లను శుభ్రం చేయవచ్చు. ఇది జార్ నుంచి వచ్చే వాసనను, పసుపు మరకలను ఈజీగా క్లీన్ చేస్తుంది. నిమ్మ తొక్కలను లోపల, బయట రుద్దండి. ఇలా ఐదు నిమిషాలు రుద్ది నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
*జార్ పై మరకలు తొలగించడానికి నీటిలో రెండు నిముషాలు వెనిగర్ వేసి మిక్సీ లో వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే పసుపు మరకలు, దుర్వాసన మాయమవుతుంది.

Idly Batter : ఫ్రిడ్జ్ లేకుండా ఇడ్లీ పిండి, అట్ల పిండిని స్టోర్ చేయడం ఎలా ?

ఇవే టిప్స్ గ్రైండర్స్ కి కూడా వాడొచ్చు. ఈ టిప్స్ ని ఉపయోగించి మిక్సీలని, గ్రైండర్లని శుభ్రం చేసుకొని ఎండలో కాసేపు పెడితే మంచిగా పని చేస్తాయి. చూడటానికి కూడా నీట్ గా ఉంటాయి.