Oil Skin : ఆయిల్ స్కిన్ ని మార్చుకోవాలంటే.. ఇలా చేయండి..

Kaburulu

Kaburulu Desk

November 25, 2022 | 01:17 PM

Oil Skin : ఆయిల్ స్కిన్ ని మార్చుకోవాలంటే.. ఇలా చేయండి..

Oil Skin :  కొంతమందికి స్కిన్ ఆయిల్ గా ఉంటుంది. వారికి ఎంత మేకప్ వేసిన స్కిన్ ఆయిల్ గా ఉండటం వలన ఫేస్ జిడ్డుగానే కనబడుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మొటిమలు మరియు చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మన ఫేస్ పై ఆయిల్ని తగ్గించుకుంటే చర్మ సమస్యలను తగ్గేలా చేయవచ్చు. దాని కోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటించవచ్చు.

*ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు రోజుకు కనీసం రెండు మూడు సార్లు నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దుమ్ము ధూళి ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
*ఫేస్ ప్యాక్ లు వారానికి మూడు సార్లు చేసుకోవాలి. చార్కోల్ మాస్క్, చందనం మాస్క్ మరియు ముల్తాన్ మట్టి మాస్క్ ఏదయినా ఒక రకమైన మాస్క్ వేసుకుంటే చర్మం చాలా ప్రకాశవంతంగా మరియు ఆయిల్ నెస్ తగ్గుతుంది.
*రోజూ రాత్రి పడుకునే ముందు స్పూన్ పసుపులో కొద్దిగా పాలు కలిపి ముద్దగా చేసుకొని ముఖానికి మరియు మెడకు రాసుకోవాలి. ఇలా చేస్తే ఆయిల్ స్కిన్ తగ్గుతుంది.
*స్నానానికి ముందు బంగాళాదుంప, దోసకాయ లేదా ఆపిల్ ముక్కతో ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు తొలగిపోతుంది.
*మేకప్ వేసుకుంటే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తొలగించి పడుకోవాలి. ఇలా చేస్తే చర్మ సమస్యలు తగ్గించుకోవచ్చు.
*నారింజ పొడిలో నీటిని కలిపి మాస్క్ లాగా ముఖానికి రాసుకుంటే జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు వచ్చే సమస్య తగ్గుతుంది.
*మొక్కజొన్న పిండిలో వేడి నీటిని కలిపి మాస్క్ లాగా వేసుకోవాలి 15 మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే ఫేస్ క్లీన్ గా ఉంటుంది.