Heligan pineapple : వామ్మో ఈ పైనాపిల్ ధర లక్ష రూపాయలా?? ఏంటో స్పెషల్??

Kaburulu

Kaburulu Desk

December 11, 2022 | 04:08 PM

Heligan pineapple : వామ్మో ఈ పైనాపిల్ ధర లక్ష రూపాయలా?? ఏంటో స్పెషల్??

Heligan pineapple : ఇంగ్లాండ్లో లభ్యమయ్యే ఈ పైనాపిల్ ధర చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కో పండు ధర అక్షరాలా లక్ష రూపాయలు. ప్రపంచంలోనే ఖరీదైన పైనాపిల్ ఇదే. అయినా దీన్ని కొనేందుకు పోటీ పడుతున్నారు. సాధారణంగా పైనాపిల్ ధర 50 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. కానీ బ్రిటన్లోని హెలిగాన్ పైనాపిల్ మాత్రం లక్ష పలుకుతోంది.

పైనాపిల్ విటమిన్ సి ఎక్కువగా లభించే పండు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ తోపాటు మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల వైద్యులు కూడా దీన్ని సూచిస్తున్నారు. ఇంగ్లాండ్లో లభ్యమయ్యే ఈ హెలిగాన్ పైనాపిల్ పంట చేతికి వచ్చేందుకు దాదాపు రెండు నుండి మూడు ఏళ్లు పడుతుందని అక్కడి గార్డెన్ నిర్వాహకులు వెల్లడించారు. అందుకే ఇంత ధరేమో.

Jonna Rotte : జొన్నలతో చేసిన రొట్టెలు తినండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా తెలుసా??

తొలిసారిగా దీనిని 1819లో బ్రిటన్ కు తీసుకువచ్చారు. అయితే అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెక్కతో తయారు చేసిన పెద్ద కుండీలను తయారుచేసి అందులో సేంద్రియ ఎరువులను నింపి తగినంత ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పైనాపిల్ సాగుకు చాలా మంది కూలీలు కావాలి. చిన్నపిల్లలను పెంచినంతలా వీటిపై శ్రద్ధ చూపించాలి. దీనికి తోడు రవాణా ఖర్చులు, స్టోరేజ్ ఇలా అన్ని లెక్కవేస్తే కనీసం లక్ష రూపాయలు అమ్మనిదే గిట్టుబాటు కావడం లేదని అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఈ హెలిగాన్ పైనాపిల్ ను గతంలో దివంగత ఎలిజిబెత్ 2కి బహుమతిగా కూడా ఇచ్చారట. ప్రస్తుతం ఒక్క పైనాపిల్ ని లక్ష రూపాయలకి విక్రయిస్తున్నారని, ఒకవేళ వేలం పెడితే పది లక్షల వరకు ధర పలకవచ్చని గార్డెన్ నిర్వాహకులు అంటున్నారు.