Copper Vessel Water : రాగి పాత్రల్లో నీరు ఎందుకు త్రాగుతారో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

September 14, 2022 | 01:10 PM

Copper Vessel Water : రాగి పాత్రల్లో నీరు ఎందుకు త్రాగుతారో తెలుసా..?

Copper Vessel Water :  పూర్వకాలంలో చాలామంది రాగి చెంబులు, రాగి గ్లాసులు, మర చెంబుల్లోనే నీళ్లు తాగేవాళ్ళు. రాగి బిందెల్లో నీళ్లు పట్టేవారు. ఒకప్పుడు రాగిని ఎక్కువగా వాడేవారు. ఈ రోజుల్లో రాగి పాత్రలను వాడితే అవి తొందరగా నల్లగా మారతాయి, వాటిని శుభ్రంగా ఉంచడానికి టైం పడుతుంది అని కూడా చాలా మంది రాగి వాడకాన్ని తగ్గించారు. కానీ ఇప్పటికి కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ లో రాగి గ్లాస్ లలో, రాగి జగ్గులతోనే వాటర్ ఇస్తారు. ఎందుకంటే రోజూ రాగి పాత్రలు, సీసాలు, రాగి గ్లాసులలో నీరు త్రాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే గుళ్ళల్లో, పూజల దగ్గర కూడా రాగి పాత్రలే ఎక్కువగా వాడతారు.

*రోజూ రాగి పాత్రల్లో నీటిని రాత్రంతా నిలువ ఉంచి పొద్దున్నే త్రాగితే బరువు తగ్గుతారు. అధిక బరువుని తగ్గించడానికి రోజూ రాగి పాత్రలో నీరు త్రాగాలి.
*రాగి పాత్రల్లో నీరు తాగడం వల్ల బీపీ, హార్ట్ బీట్ అదుపులో ఉంటాయి.
*రాగి పాత్రలో నీరు త్రాగితే క్యాన్సర్ సమస్యను పెంచే కణాలు మన శరీరంలో పెరగకుండా ఉంటాయి.
*కాపర్ మన శరీరంలో తగినంత లేకపోవడం వలన థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే రాగి పాత్రల్లో నీళ్లు తాగాలి.
*రాగి పాత్రలో నీటిని త్రాగడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడమే కాక కడుపులో అల్సర్లు లాంటివి రాకుండా చేస్తుంది.
*రాగి పాత్రలో ఉండే గుణాలు మనం త్రాగే నీటిలో ఉండే చెడు బ్యాక్తీరియాను నాశనం చేస్తుంది.

Coriander : కొత్తిమీరతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

అందుకే పూర్వకాలంలో చాలా మంది రాగి పాత్రల్లోనే నీళ్లు తాగేవాళ్ళు, ఇప్పటికి కొంతమంది ఇళ్లల్లో మన గ్రాండ్ పేరెంట్స్ రాగి పాత్రల్లోనే నీరు తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఇకనుంచి అయినా మనం రోజూ రాగిపాత్రల్లో నీరు తాగి ఆరోగ్యంగా ఉందాం.