Health Benefits of Almonds : బాదంపప్పు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Kaburulu

Kaburulu Desk

September 7, 2022 | 12:57 PM

Health Benefits of Almonds : బాదంపప్పు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Health Benefits of Almonds :  ఈమధ్యకాలంలో తృణధాన్యాలు, నట్స్, డ్రై ఫ్రూట్ ని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందుకు కారణం వాటిల్లో ఉండే ఎక్కువ పోషకవిలువలు. ప్రజలు కూడా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినాలని భావిస్తున్నారు. ఎక్కువమంది తీసుకునే డ్రై ఫ్రూట్, సులువుగా దొరికేది బాదంపప్పు. బాదంపప్పును రోజూ తింటే ఆరోగ్యపరంగా చాలా రకాల లాభాలను పొందవచ్చు.

బాదంపప్పులో పోషకవిలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే బాదం ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రోటీన్ పీచుతో నిండి ఉంటుంది.

బరువు తగ్గడం, రక్తపోటుని అదుపులో ఉండేందుకు, గుండె ఆరోగ్యంగా ఉంచడానికి, క్యాన్సర్ ముప్పు నుండి మనల్ని కాపాడటంలో బాదంపప్పు చాలా మేలు చేస్తుంది. బాదంపప్పు రోజూ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కడుపుతో ఉన్న మహిళలు రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. నానబెట్టిన బాదం తినడం వలన జీర్ణక్రియ కూడా ఈజీగా జరుగుతుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల రోజంతా యాక్టీవ్ గా, అలసట లేకుండా ఉంటాం. ఇలా బాదంపప్పు తినడం వల్ల అనేక రకాల లాభాలు అన్ని వయసుల వారికి ఉన్నాయి కాబట్టి అందరూ బాదంపప్పుని రోజూ తింటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.