Food for Suger patients : షుగర్ పేషెంట్స్ ఆహారంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 4, 2022 | 04:00 PM

Food for Suger patients : షుగర్ పేషెంట్స్ ఆహారంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

Food for Suger patients :  ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ వస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది అని అనుకునేవారు కానీ ఇప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి అనేది ఉంది. ఏదయినా వేరే రకాల జబ్బులు ఉన్నప్పుడు టెస్టులు చేయించుకుంటే షుగర్ ఉంది అని చాలా మందికి బయటపడుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది.

షుగర్ పేషంట్స్ తీసుకునే ఆహరం ద్వారానే షుగర్ ని కంట్రోల్లో ఉంచగలరు. కాబట్టి షుగర్ క్వాంటిటీ ఉంటే ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అన్నం తక్కువగా తినాలి. కూర ఎక్కువగా తినాలి. షుగర్ పేషంట్స్ కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రాట్ లు తక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి, పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. ఫ్రూట్స్ తియ్యగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ తినకూడదు అనే అపోహ చాలా మందికి ఉంటుంది.

Kobbari Puvvu : ఇష్టంగా తినే కొబ్బరిపువ్వు.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

కానీ ఫ్రూట్స్ లో కొన్నిరకాలను షుగర్ పేషంట్స్ తినవచ్చు. బొప్పాయి, పుచ్చకాయ, నారింజ, దానిమ్మపండు, అవకాడో, దోర జామకాయ, స్ట్రాబెర్రీ.. ఇలా పలు రకాల పండ్లను షుగర్ పేరెంట్స్ తినవచ్చు. అవిసె గింజలను మెత్తగా నూరి పండ్లు తినేటపుడు వాటిపై జల్లుకుంటే వాటిలో ఉన్న కొద్దిపాటి చక్కర శాతం కూడా తగ్గిపోతుంది. ఇంకా చపాతీలు, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తినొచ్చు. షుగర్ పేషంట్స్ ఎవ్వరైనా సరే మీ ఫుడ్ ని కంట్రోల్లో ఉంచుకుంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్లే.