Tips for Good Sleep : మీకు నిద్ర పట్టట్లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Kaburulu

Kaburulu Desk

September 12, 2022 | 01:52 PM

Tips for Good Sleep : మీకు నిద్ర పట్టట్లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Tips for Good Sleep :  ఇటీవల కాలంలో చాలా మంది లేట్ గా నిద్రపోతున్నారు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. చాలా మంది రాత్రుళ్ళు లేట్ గా పడుకోవడంతో కంటి సమస్యలు, ఊబకాయం సమస్యలు, తలనొప్పి, అలసట, యాక్టీవ్ గా లేకపోవడం లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి.

ఒకవేళ మీరు త్వరగా పడుకుందామన్నా నిద్ర రాకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. త్వరగా నిద్రపోవచ్చు.

* నిద్ర పోవడానికి ముందు స్నానం చేయాలి, దీని వల్ల మనం ఫ్రెష్ గా ఉంటాం, దీంతో తొందరగా నిద్ర పడుతుంది.
* నిద్ర పోయే ముందు చాలా మంది వారి జీవితంలో జరిగిన సంఘటనలు, లేదా ఆ రోజు చేసిన పనులని, గతంలో జరిగిన తప్పులని గుర్తు చేసుకుంటారు. పడుకునేటప్పుడు అసలు ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పడుకోవాలి.
* పడుకునే ముందు గోరువెచ్చని పాలు త్రాగితే త్వరగా మంచి నిద్ర పడుతుంది.
* రాత్రిపూట అరటిపండు తినడం వలన మన శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గి మంచి నిద్ర పడుతుంది.
* పడుకునే ముందు చెర్రీ ఫ్రూట్స్, లేదా ఏదైనా జ్యూస్ తాగినా మంచి నిద్ర పడుతుంది.
* రాత్రిపూట ఎక్కువగా బిర్యానీలు, ఆయిల్ ఫుడ్ లాంటివి కాకుండా ఏదైనా సాత్వికాహారం తీసుకోవాలి. లేదా పెరుగన్నం/మజ్జిగ అన్నం తింటే నిద్ర తొందరగా వస్తుంది.
* పడుకునే ముందు ధ్యానం చేస్తే కూడా చాలా త్వరగా నిద్ర వస్తుంది.
*చాలా మందికి బుక్స్ చదివితే నిద్ర వస్తుంది అంటారు. ఇది నిజం కూడా. రాత్రిపూట పడుకునేముందు ఏవైనా బుక్స్ చదివితే నిద్ర వస్తుంది.
* అలాగే రాత్రిపూట ప్రశాంతమైన పాటలు లేదా సంగీతం విన్నా కూడా నిద్ర పడుతుంది.
*ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఈ రోజుల్లో నిద్రని మనకి దూరం చేసేది ఫోన్. చాలా మంది ఫోన్ కి అడిక్ట్ అయి రాత్రిపూట కూడా ఫోన్ వాడుతూ పక్కన పెట్టుకొని పడుకుంటారు. రాత్రిపూట మంచి నిద్ర పట్టాలంటే ఒక గంట ముందు నుంచే ఫోన్ ని వాడకుండా ఉండాలి. పడుకునేటప్పుడు పక్కనే కాకుండా ఫోన్ ని కొంచెం దూరంలో పెట్టాలి. ఫోన్ దూరంగా ఉంటే సగం సమస్య తీరినట్టే, ప్రశాంతంగా పడుకోవచ్చు.

Health Benefits of Almonds : బాదంపప్పు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

మీకు రాత్రిపూట నిద్ర రాకపోతే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి, రాత్రిపూట త్వరగా పడుకొని ఆరోగ్యంగా ఉండండి.