Mehndi : పండగకి గోరింటాకు పెట్టుకుంటున్నారా?? బాగా పండాలంటే ఇలా చేయండి..

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల కోసం గోరింటాకు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారా?. అది మరింత బాగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది...........

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 07:26 PM

Mehndi : పండగకి గోరింటాకు పెట్టుకుంటున్నారా?? బాగా పండాలంటే ఇలా చేయండి..

Mehndi :  భోగి, సంక్రాంతి, కనుమ పండుగల కోసం గోరింటాకు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారా?. అది మరింత బాగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. అన్ని పండుగలకు, వివాహాది శుభకార్య సమయంలో మనకి గోరింటాకు అన్నది ఒక సాంప్రదాయ అలవాటు. ఇది అందానికి మాత్రమే కాదు, ఒత్తిడిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం అందరికీ చాలా ఇష్టం. ఇది బాగా పండాలని అందరూ కోరుకుంటారు. అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా, అందంగా కనిపిస్తున్నారు. అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు మనలోని టెన్షన్ తగ్గించి, నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. గోరింటాకు బాగా పండటానికి ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.

* మంచి క్వాలిటీ బ్రాండెడ్ కోన్ మాత్రమే వాడండి.
* చేతులను శుభ్రంగా కడుక్కొని తుడిచి, ఆరిన తర్వాతే మెహందీ అప్లై చేయాలి.
* పెట్టిన తర్వాత ఒక గంట పాటు కదపకుండా గాలి తగిలేలా ఉంచాలి.
* ఒకసారి వేసిన గోరింటాకు 4 గంటల్లో పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమాన్ని గోరింటాకు పై చల్లాలి లేదా దూదితో గోరింటాకుపై అద్దాలి.ఈ మిశ్రమం కూడా గోరింటాకుతో కలిసి బాగా పండేలా చేస్తుంది.
* ఆ తర్వాత పూర్తిగా ఆరిపోయాక డైరెక్ట్ గా నీటిలో కడిగేయకుండా వీలైనంతవరకు పొడిని చేతులతో తొలగించి ఆపై నీటితో కడగండి.
* కడిగిన 12 గంటల తర్వాత గోరింటాకు ఎర్రగా అవుతుంది . మరో 12 గంటల తర్వాత నల్లగా అవుతుంది. అంటే 24 గంటలు ముందే వేసుకుంటే సరైన టైంకి బాగా పండినట్లు కనిపిస్తుంది.
* కొంతమంది గోరింటాకు వేసుకునే ముందు అరచేతులపై యూకలిఫ్టస్ ఆయిల్ ను కూడా రాసుకుంటారు.