Depression : డిప్రెషన్ కి గురవుతున్నారా.. సంతానోత్పత్తి తగ్గడం ఖాయం…

Kaburulu

Kaburulu Desk

November 30, 2022 | 09:13 AM

Depression : డిప్రెషన్ కి గురవుతున్నారా.. సంతానోత్పత్తి తగ్గడం ఖాయం…

Depression : ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఉద్యోగం రాలేదనో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అనో, లేకపోతే డబ్బులు లేవు అనో ఏదో ఒకదానికి డిప్రెషన్ కి గురవుతున్నారు. ఇలా డిప్రెషన్ కి గురైన వారు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంతానోత్పత్తి తగ్గడం.

డిప్రెషన్ కి గురైన వారు మరియు డిప్రెషన్ బారిన పడని వారిని కంపేర్ చేస్తే డిప్రెషన్ కి గురైన వారిలో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతున్నాయట. ఇది పురుషులు, మహిళల్లో ఇద్దరిలోనూ కనబడుతుంది. స్త్రీలు ఎక్కువగా డిప్రెషన్ కి గురయితే సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయి కానీ పురుషులు కొద్దిగా డిప్రెషన్ కి లోనైనా కూడా సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయి.

Hangover : హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడం ఎలా??

కాబట్టి డిప్రెషన్ ని సరైన సమయంలో కనిపెట్టి దానిని తగ్గించుకోవాలి. అప్పుడే సంతానోత్పత్తి అవకాశాలు తగ్గడాన్ని నివారించవచ్చు. డిప్రెషన్ ని దూరం చేసుకోవడానికి మహిళలైనా, పురుషులైనా ఏదయినా ఒక హాబీని అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానం, సినిమాలు చూడటం, ఇష్టమైన వారితో గడపటం, ఏదైనా పనిలో నిమగ్నమవడం.. లాంటివి చేస్తే డిప్రెషన్ నుంచి త్వరగా బయటకి రావొచ్చు. డిప్రెషన్ వలన వచ్చే అనేక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు.