Fasting : ఉపవాసం అనేది మూఢనమ్మకం అనుకుంటున్నారా? దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

 ఉపవాసం అంటే అందరూ ఏమి తినకుండా ఉండాలి రోజంతా అని అనుకుంటారు. కొంతమంది పాలు, పండ్లు తింటూ ఉపవాసం చేస్తారు. కొంతమంది అన్నం మాత్రం..............

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 07:44 PM

Fasting : ఉపవాసం అనేది మూఢనమ్మకం అనుకుంటున్నారా? దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Fasting :  ఉపవాసం అంటే అందరూ ఏమి తినకుండా ఉండాలి రోజంతా అని అనుకుంటారు. కొంతమంది పాలు, పండ్లు తింటూ ఉపవాసం చేస్తారు. కొంతమంది అన్నం మాత్రం తినరు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. కొంతమంది ఉపవాసం అనేది ఒక మూఢ నమ్మకం కింద తీసేస్తారు. కానీ మన పెద్దలు ఏమి చెప్పినా దాంట్లో ఒక సైన్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కచ్చితంగా ఉంటాయి. ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు, మనకోసం కూడా. ఉపవాసం వలన కూడా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం మరియు ఆధునిక శాస్త్రవేత్తల ప్రకారం కూడా ఉపవాసం ఉండడం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు.

షుగర్ ఉన్నవారు, లేదా వచ్చి తగ్గిన వారు, షుగర్ మనకు వస్తుంది ఏమో అని అనుకునేవారు ఉపవాసం ఉండడం వలన మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని వలన మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉపవాసం ఉండడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వలన గుండె పోటు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయడం వలన ఊబకాయం అనేది తగ్గుతుంది. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిదే దాని వలన శరీర బరువు తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళన లేదా ఒత్తిడి వంటివి ఉన్నవారు కూడా ఉపవాసం చేయడం వలన తగ్గుతాయి. ఉపవాసం చేసేవారు ఎవ్వరైనా సరే నెలకు నాలుగు లేదా ఐదు సార్లు చేస్తే మంచిది. దాని వలన మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మనకు షుగర్ వంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఉపవాసం చేయవచ్చు.

Papaya : బొప్పాయి పండు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?? మీకు తెలుసా?

అలాగే ఉపవాసం దేవుడికోసం చేసేవాళ్ళు దైవ చింతనలో గడుపుతారు కాబట్టి మనసు, శరీరం, మెదడు తేలికపడతాయి. చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఉపవాసం అనేది శరీరంతో పాటు మనసుకి, మెదడుకి కూడా మంచిదే.