Ear Phones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?? అయితే మీ చెవులు జాగ్రత్త..

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 06:41 PM

Ear Phones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?? అయితే మీ చెవులు జాగ్రత్త..

Ear Phones :  ప్రస్తుతం ఆధునిక జీవితంలో అందరూ చాలా రకాల గాడ్జెట్స్ ని వాడుతున్నారు. వాటిలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వంటివి బాగా, ఎక్కువగా ఎప్పుడూ మన చెవిలోనే ఉంచుకొని వర్క్ చేసుకోవడం లేదా కాల్స్ మాట్లాడడం, పాటలు వినడం వంటివి చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ లాంటివి ఎప్పుడైనా ఒకసారి వాడితే పర్వాలేదు కానీ రోజూ ఎక్కువ సమయం వాడితే మనం అనారోగ్య సమస్యలకు గురి అవుతాము.

ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ చెవిలో ఎక్కువగా పెట్టుకోవడం వలన చెవిలో నొప్పి, చెవి పోటు వచ్చే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ ఒకరివి ఇంకొకరు మార్చుకుంటూ ఉంటారు కానీ ఇలా చేయడం వలన చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకరి చెవిలోని బాక్టీరియా ఇయర్ బడ్స్ లో చేరి అవి ఇంకొకరి చెవిలోనికి వెళ్తాయి ఈ విధంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకొకరికి ఇచ్చి తరువాత మళ్ళీ మనం వాడేటప్పుడు వాటిని క్లీన్ చేసుకొని వాడుకోవాలి లేదా ఎవ్వరికి ఇవ్వకుండా ఎవరిది వారు వాడుకుంటే ఇంకా మంచిది.

Numbness : మీకు తిమ్మిర్లు రెగ్యులర్ గా వస్తున్నాయా.. వీటికి కారణమేంటో తెలుసా??

అలాగే ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన మన చెవులపైనే కాకుండా మెదడుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇయర్ ఫోన్స్ నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడును చెడుగా ప్రభావితం చేస్తాయి. అలాగే తలా నొప్పి కూడా వస్తుంది. చెవుల్లో రీ సౌండ్స్ వస్తాయి. అందుకే ఎక్కువగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వాడటాన్ని తగ్గించుకోవాలి. మేము వాడటం తప్పదు అనుకుంటే ఇయర్ ఫోన్స్ కి రెండువైపులా ఒకే సౌండ్ ఉండేలా చూసుకోవాలి. మీరు వాడే వాటిని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు 60 నిముషాల తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి రోజంతా వాడటం మంచిది కాదు.