Drinking Water : టీ, కాఫీ లు తాగే ముందు నీరు తాగుతున్నారా?? అయితే మంచిదే.. ఎందుకో తెలుసా??

టీ, కాఫీలు తాగడం ఈ మధ్య అందరికీ అలవాటే. కానీ వీటిలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. చాలా మంది పెద్దలు టీ, కాఫీ తాగేముందు మంచి నీళ్లు తాగుతారు. అయితే అవి తాగేముందు నీళ్లు తాగడం వలన............

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 05:00 PM

Drinking Water : టీ, కాఫీ లు తాగే ముందు నీరు తాగుతున్నారా?? అయితే మంచిదే.. ఎందుకో తెలుసా??

Drinking Water :  టీ, కాఫీలు తాగడం ఈ మధ్య అందరికీ అలవాటే. కానీ వీటిలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. చాలా మంది పెద్దలు టీ, కాఫీ తాగేముందు మంచి నీళ్లు తాగుతారు. అయితే అవి తాగేముందు నీళ్లు తాగడం వలన మన ఆరోగ్యానికి మంచిది. మనం తాగే టీ, కాఫీలలో టానిన్ ఉంటుంది ఇది దంతాల రంగును మారుస్తాయి. కాబట్టి ఇవి తాగే కంటే ముందు మంచి నీళ్లు ఒక గ్లాస్ తాగాలి. ఇది మన దంతాలపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తుంది. దీని వలన మన దంతాలు రంగు మారకుండా ఉంటాయి.

ఎక్కువ మందికి ఉదయం బ్రష్ చేసుకున్న వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంది. కానీ ఖాళీ కడుపుతో అవి తాగడం వలన మన శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగా ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగాలి దీని వలన శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. టీ లేదా కాఫీ తాగే కంటే ముందు నీరు తాగడం వలన పోషకాలు శరీరంలో ఉండిపోతాయి.

Sitting on Floor : నేలపై కూర్చుంటే ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

టీ లేదా కాఫీ తాగే కంటే ముందు నీరు తాగడం వలన మన పొట్టలో విడుదల అయ్యే ఆసిడ్ శాతం ph విలువ 5 మరియు 6గా ఉంటుంది అది తగ్గుతుంది. దీని వలన పొట్ట దెబ్బతినడం, నోటిలో ఏర్పడే అల్సర్లు తగ్గుతాయి. టీ, కాఫీలను తాగడం వలన పేగుల్లో పుండ్లు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే టీ, కాఫీ తాగే కంటే ముందు నీరు తాగడం వలన అవి ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మనం ఎవ్వరమైనా ఎప్పుడైనా టీ లేదా కాఫీ తాగే గ్లాసుడు మంచి నీళ్ళు తాగాలి. దీని వలన మన శరీరంలో జరిగే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.