Sleep after eat : ఆహరం తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. ఇలా అయితే కష్టమే..

Kaburulu

Kaburulu Desk

November 26, 2022 | 02:10 PM

Sleep after eat : ఆహరం తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. ఇలా అయితే కష్టమే..

Sleep after eat :  ఇప్పుడు చాలా మందికి రాత్రిపూట నిద్రపోవడానికి, అన్నం తినడానికి మధ్య ఎక్కువ సమయం అనేది ఉండటం లేదు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఖచ్చితంగా అన్నం తినడానికి నిద్ర పోవడానికి మధ్య ఒక గంట సమయం ఉండేలా చూసుకోవాలి. అలా కుదరదు అనుకుంటే కనీసం ఒక అరగంట సమయం అయినా ఉండేలా చూడాలి.

అలాగే రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా ఆహరం తిన్న వెంటనే పడుకోకూడదు. ఆహరం తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది మరియు కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఆహరం తిన్న తరువాత నిద్రకు కొద్దిగా ఖాళీ సమయం ఉంచాలి.

Night Food : రాత్రిపూట అన్నం తిన్న తరువాత, తినే ముందు ఈ పనులు చేయండి.. రిజల్ట్ మీరే చూడండి..

అలాగే రాత్రి భోజనం తిన్న తరువాత ఎక్కువ ఎక్సర్సైజ్ లు చేయకూడదు. ఆహరం తిన్న తరువాత ఖచ్చితంగా ఒక పది లేదా పదిహేను నిముషాలు నడవాలి. ఇది ఆహరం చక్కగా జీర్ణం అవడానికి మంచి వ్యాయామం. తిన్న వెంటనే పడుకుంటే ఆహరం సరిగా జీర్ణం కాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒబిసిటీ సమస్యలు, శ్వాశకోశ సమస్యలు కూడా వస్తాయి.