Dog Food : మీ పెంపుడు కుక్కలకు ఎలాంటి ఆహరం పెడుతున్నారు? మీరు తినేదే పెడుతున్నారా? కచ్చితంగా తెలుసుకోండి..
మనుషులు తినే అన్ని రకాల ఆహారపదార్థాలు కుక్కలు జీర్ణించుకోలేవు. కాబట్టి వాటికి పెట్టే ఆహారపదార్థాలను గమనించి పెట్టాలి. మనం రోజూ తినే.................

Dog Food : ఈ రోజుల్లో మనలో చాలా మంది పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే వాటిని కొంతమంది మన ఫ్యామిలీలో మెంబెర్ గా చూసుకుంటున్నారు. మనం పెంచుకునే పెంపుడు కుక్కలు యజమానులకు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. యజమానులు ఉన్నంతవరకు వారికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాయి. యజమానులను ప్రమాదాల నుండి కాపాడుతాయి. కాబట్టి వారు తినే ఆహారాన్నే వాటికి కూడా పెడుతున్నారు. కానీ మనం తినే అన్ని ఆహార పదార్థాలను మనం పెంచుకునే కుక్కలకు పెట్టకూడదు. అవి వాటి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మనం తెలిసో తెలియకో చేసిన పనుల వలన మనం పెంచుకునే కుక్కలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఎటువంటి ఆహారపదార్థాలను మనం పెంచుకునే పెంపుడు కుక్కలకు ఇవ్వకూడదో తెలుసుకోండి.
మనుషులు తినే అన్ని రకాల ఆహారపదార్థాలు కుక్కలు జీర్ణించుకోలేవు. కాబట్టి వాటికి పెట్టే ఆహారపదార్థాలను గమనించి పెట్టాలి. మనం రోజూ తినే ఉల్లిపాయలు కుక్కలకు ఆహారంగా పెట్టకూడదు. అవి వాటి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మష్రూమ్స్ కూడా కుక్కలకు తినిపించకూడదు. అవి కూడా వాటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. టమాటాలు కూడా ఎక్కువగా పెట్టకూడదు. ఎర్రని టమాటాలు కొన్ని పెట్టవచ్చు. కానీ రోజూ టమాటాలు తినిపించకూడదు. గ్రీన్ టమాటాలు కుక్కలకు అస్సలు పెట్టకూడదు. ద్రాక్ష పళ్ళు అస్సలు తినిపించకూడదు. అవి తినిపించడం వలన కుక్కలకు కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.
Onion Oil : ఉల్లిపాయ నూనె వలన కూడా అనేక ఉపయోగాలు ఉంటాయని తెలుసా?
చెర్రీ పండ్లను కూడా కుక్కలకు తినిపించకూడదు. చెర్రీ పండ్లను తినిపిస్తే కుక్కలకు కంటి సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి వస్తాయి. కుక్కల రక్తకణాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం కుక్కలకు ఫుడ్ పెట్టేటప్పుడు ద్రాక్ష, గ్రీన్ టమాటా, చెర్రీ, మష్రూమ్స్, ఉల్లిగడ్డలు ఉండకుండా ఉండేలా చూసుకోండి. దీని వలన మనం వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటికి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.