Winter : చలికాలంలో ఈ పనులు చేయకండి..

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 05:48 PM

Winter : చలికాలంలో ఈ పనులు చేయకండి..

Winter :  చలికాలం రాగానే అందరూ మొదటగా మార్చుకునే అలవాటు వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన చర్మం పొడిబారుతుంది. కాబట్టి మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రి పూట పడుకునే ముందు మేకప్ వేసుకుంటే తీసేసి పడుకోవాలి లేకపోతే చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రము చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోవాలి.

చలికాలంలో మనం తినే ఆహరం తొందరగా చల్లారిపోతూ ఉంటుంది. అయినా కూడా వీలైనంత వరకు వేడి ఆహరం తినేలా చూసుకోవాలి ఎందుకంటే చల్లారిన ఆహార పదార్థాలు చలికాలంలో తొందరగా అరగవు. రాత్రి పూట అస్సలు చల్లని ఆహార పదార్థాలు తినకూడదు వీలైనంతవరకు వేడి ఆహార పదార్థాలు తినేలా చూసుకోవాలి.

OCD Symptoms : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే OCD కావొచ్చు..

చలికాలంలో అందరూ కూడా నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. కాబట్టి మన శరీరంలో తేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మనకు దాహం వేసినా వేయకపోయినా కూడా అరగంటకు ఒకసారి కొన్ని నీళ్ళు తాగాలి. అప్పుడు మన శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. కాబట్టి చలికాలం రాగానే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి పాటించి మన చర్మాన్ని కాపాడుకోవాలి.