Brushing : మెరవాలని పళ్ళని గట్టిగా బ్రష్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు..

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 05:53 PM

Brushing : మెరవాలని పళ్ళని గట్టిగా బ్రష్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు..

Brushing : అందరూ ఉదయాన్నే లేచిన వెంటనే చేసే పని బ్రష్ చేసుకోవడం. కొంతమంది రోజుకు ఒకసారి బ్రష్ చేసుకుంటే మరికొంతమంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. అయితే మనం ఎన్ని సార్లు బ్రష్ చేసుకుంటున్నాము కంటే మనం ఏ విధంగా చేసుకుంటున్నామో చూసుకోవాలి.

కొంతమంది అదేపనిగా బ్రష్ తో పళ్ళని రుద్దేస్తారు. కానీ బ్రష్ తో సర్కిల్స్ షేప్స్ లో బ్రష్ చేసుకోవాలి. అలాగే మనం బ్రష్ చేసుకునే బ్రష్ హార్డ్ గా ఉందా మృదువుగా ఉందా చూసుకోవాలి. మరీ మృదువైనది కాకుండా ఒక మీడియం బ్రష్ ను ఎంచుకోవాలి. బ్రష్ ను ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. అలాగే బ్రష్ చేసుకున్న తరువాత నోటిని పుక్కిలించాలి అపుడు నోటిలోని దుర్వాసన పోతుంది. ఇంకా పళ్ళ మధ్యలో ఏమైనా ఇరికినవి ఉన్న కూడా పోతాయి.

Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

దంతాలపై గట్టిగా బ్రష్ చేస్తే దంతాలపై ఉన్న ఎనామిల్ పూత పోతుంది. దానివల్ల పళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దంతాలు వాటి దృఢత్వం కోల్పోతాయి. అప్పుడు పళ్ళు తొందరగా రాలిపోవడం, పంటి నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నార్మల్ గానే బ్రష్ చేసుకోవాలి. చిన్న పిల్లల చేత కొంతమంది రోజూ బ్రష్ చేయించకుండా నోటిని పుక్కిలిస్తారు కానీ చిన్న పిల్లలు కూడా రోజూ బ్రష్ చేయాలి. అప్పుడే వారి దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. బ్రష్ ని గట్టిగా రుద్దకుండా చిన్నప్పటి నుంచే కరెక్ట్ గా ఎలా బ్రష్ చేయాలో నేర్పాలి.