Dark Circles under Eyes : కళ్ళ కింద వలయాలు ఎందుకు వస్తాయో, ఎవరికీ ఎక్కువగా వస్తాయో తెలుసా??
కళ్ళ కింద వలయాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తున్నాయి. అయితే అవి అనేక కారణాల వలన వస్తున్నాయి..........

Dark Circles under Eyes : కళ్ళ కింద వలయాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తున్నాయి. అయితే అవి అనేక కారణాల వలన వస్తున్నాయి.
*మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు, బాగా అలసటగా ఉన్నప్పుడు మనకు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి.
*తగినంత నిద్ర లేని కారణంగా మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం విడుదల అయ్యి మన కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.
*శరీరంలో చెడు హార్మోన్లు ఎక్కువగా విడుదల అవ్వడం వలన మన కళ్ళ కింద నల్లని వలయాలు, మచ్చలు వస్తాయి.
*వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో కలిగే మార్పుల వలన కూడా కళ్ళ కింద నల్లని వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.
*ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి కూడా కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి.
*డీహైడ్రాషన్ వంటి సమస్య ఉన్నవారికి కూడా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.
*హైపోథైరాయిడిజం ఉన్నవారికి కూడా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి.
*రక్తహీనత సమస్య ఉన్నవారికి కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి.
*కంప్యూటర్, లాప్ ట్యాప్ లు ఎక్కువగా వాడడం వలన కూడా కళ్ళు బాగా అలసిపోయి కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి.
*టీవీ, సెల్ ఫోన్స్ ఎక్కువసేపు చూడడం వలన, రాత్రి పూత కూడా చూడటం వలన కళ్ళు బాగా అలసట చెంది కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి.
ఇలా అనేక రకాలుగా మనకు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తున్నాయి. కొంతమంది వాటిని పోగొట్టుకోడానికి లేజర్ ట్రీట్ మెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ దీనివలన తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి సహజమైన చిట్కాలను ఉపయోగించి కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు.
Saffron : కుంకుమ పువ్వుని ఇలా వాడి అందంగా తయారవ్వండి.. ఎన్ని ప్రయోజనాలో కుంకుమపువ్వుతో..
ఎక్కువసేపు ఫోన్, టీవీ చూడకుండా ఉండటం.. రాత్రిపూట తొందరగా పడుకోవడం.. కళ్ళ మీద కీరదోస, ఆలు, టమాటా లాంటి ముక్కలని కాసేపు పెట్టుకోవడం.. ముఖాన్ని రోజుకి రెండుసార్లు కడుక్కోవటం లాంటి పలు సహజమైన పద్ధతుల్లో కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలు తొలిగించుకోవచ్చు.