Ants : చీమల బారి నుండి తప్పించుకోవడం ఎలా ?

ఇటీవల ఇళ్లల్లో అందరికి చీమల బాధ ఎక్కువ అవుతుంది. ఏ మూల చూసినా, వంట గదిలో ఏ డబ్బాలో చూసినా అవే కనిపిస్తాయి. ఒకసారి బాట బయలుదేరితే ఎండ్ పాయింట్ ఉండదు వాటికి. గోడలు, గడపలు ఎక్కడ చూసినా...........

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 06:51 PM

Ants : చీమల బారి నుండి తప్పించుకోవడం ఎలా ?

Ants :  ఇటీవల ఇళ్లల్లో అందరికి చీమల బాధ ఎక్కువ అవుతుంది. ఏ మూల చూసినా, వంట గదిలో ఏ డబ్బాలో చూసినా అవే కనిపిస్తాయి. ఒకసారి బాట బయలుదేరితే ఎండ్ పాయింట్ ఉండదు వాటికి. గోడలు, గడపలు ఎక్కడ చూసినా దాని వరుసే. ఏదన్నా తినే పదార్థం, స్వీట్ ఐటమ్స్ ఏమైనా ఇంట్లో ఉంటే చీమలు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ చీమలని కెమికల్స్ వాడకుండానే వదిలించుకోవచ్చు.

చీమలు పడకుండా మనం ఆహార పదార్థాలను ఎలా కాపాడుకోవాలో కొన్ని చిట్కాలను పాటిస్తే చీమలు మన ఇంటి నుంచి పారిపోతాయి.
*చీమల్ని తరిమి కొట్టడానికి మిరియాలు సహాయపడతాయి. మిరియాల ఘాటుకు చీమలు పారిపోవడం ఖాయం. కిచెన్ లో మిరియాలు అక్కడక్కడా కొన్ని పెడితే ఆ ఘాటుకు చీమలు రావు.
* రెండు కప్పుల నీళ్లలో కొంచెం పెప్పర్ మెంట్ ఆయిల్ ను కలిపి ఒక బాటిల్లో పోసి చీమలు ఉన్నచోట స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.ఇది స్ప్రే చేసేటప్పుడు మీ ఇంట్లో ఉండే పెట్స్ ని దూరంగా పెట్టండి.
*రెండు కప్పుల నీటిలో ట్రీ ఆయిల్ ను కలిపి స్ప్రే చేసినా, కాటన్ బాల్స్ ని ఈ వాటర్ లో ముంచి కిచెన్ రాక్స్ లో ఉంచినా మంచి రిజల్ట్ ఉంటుంది.
*దాల్చిన చెక్క కూడా చీమల బాధ నుంచి రిలీఫ్ పొందడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క ఆయిల్ లో కాటన్ బాల్స్ ని డిప్ చేసి చీమలు తిరిగే ప్రదేశంలో పెడితే చీమలు రాకుండా ఉంటాయి.
*వైట్ వెనిగర్ ని కూడా చీమలు ఉండే చోట స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
*వేప నూనెను రెండు కప్పుల నీటిలో వేసి బాటిల్లో పోసి స్ప్రే చేసినా చీమలు దరిచేరవు.

Walnuts : వాల్‌నట్స్ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా??

అలాగే చీమలు పట్టకుండా ఉండాలంటే మీరు ఉపయోగించే డబ్బాలకి జాగ్రత్తగా మూతలు పెట్టండి. వీలైతే టైట్ గా ఉండే డబ్బాలు మాత్రమే వాడండి ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే కూడా అంత తొందరగా చీమలు దరిచేరవు.