Coriander : కొత్తిమీరతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

September 13, 2022 | 01:43 PM

Coriander : కొత్తిమీరతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Coriander :  మనకి మార్కెట్లో కొత్తిమీర విరివిగా దొరుకుతుంది. సాధారణంగా మనం కొత్తిమీరని అన్ని రకాల కూరలలో, రసం, చారు, సాంబారు ఇంకా చాలా వాటిల్లో గార్నిష్ లాగా వాడతాం. కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకుంటాం. ఇక కొత్తిమీరని పచ్చిగా కూడా తినొచ్చు. కొంతమంది కొత్తిమీరని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

*కొత్తిమీరలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.
*కొత్తిమీర మన శరీరంలో హానికర కొవ్వు పదార్థాల స్థాయిని తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిని పెంచుతుంది.
*కొత్తిమీర తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది.
*కొత్తిమీర కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
*కొత్తిమీర తినడం వల్ల కంటికి, గుండెకు సంభందించిన వ్యాధులు రాకుండా ఉండేలా చేస్తుంది.
*కొత్తిమీర మన రక్తంలో చక్కర స్థాయిని తగ్గించి మధుమేహాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
*కొత్తిమీర కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
*కొత్తిమీర యూరినరీ ఇన్ఫెక్షన్స్ లను తగ్గించడంలో సహాయపడుతుంది.
*పిల్లలకి కొత్తిమీర రోజువారీ ఆహారంలో భాగం చేస్తే జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

Ganji : గంజి తాగితే ఇన్ని ఉపయోగాలా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

కొత్తిమీర తినడం వల్ల ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ సారి కూరల్లో, సాంబార్ లో కొత్తిమీర వస్తే తీసి పక్కన పడేయకండి. కొత్తిమీర తినండి ఆరోగ్యంగా ఉండండి.