OCD Symptoms : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే OCD కావొచ్చు..

Kaburulu

Kaburulu Desk

December 28, 2022 | 02:00 PM

OCD Symptoms : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా అయితే OCD కావొచ్చు..

OCD Symptoms :  OCD (అబ్సస్సివ్ కంపల్సివ్ డిజార్డర్) అంటే అబ్సషన్ అంటే అనవసర ఆలోచనలు పదే పదే రావడం, కంపల్సివ్ అంటే ఒకే పని పదే పదే చేయడాన్ని నియంత్రిచలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. కానీ చాలామందికి ఈ లక్షణాలు ఉన్నాయని ఇది ఒక రకమైన సమస్య అని ఎవరికీ తెలియదు. ఈ సమస్య వలన చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉండడం, రకరకాల ఆలోచనలతో మానసికంగా భాద పడుతూ ఉంటారు.

OCD లక్షణాలు :

*అనవసర ఆలోచనలు పదే పదే రావడం వాటితో డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
*తమకు కానీ ఇతరులకు కానీ ఏదయినా ప్రాబ్లెమ్ వస్తుందని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు.
*అన్ని వస్తువులు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలనుకోవడం, లేకపోతే భాద పడడం వాటిని పదే పదే శుభ్రపరచడం చేస్తూ ఉంటారు.
*తాళం వేశామా లేదా, అలారం పెట్టామా లేదా, గ్యాస్ ఆఫ్ చేశామా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు.
*అవతలి వ్యక్తి తాను చెప్పింది వింటున్నారా లేదా అని చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు.
*అవతలి వారికి దూరంగా ఉండడం, ముట్టుకుంటే క్రిములు వస్తాయి అని ఇంకా ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

ఈ లక్షణాలు కనబడగానే మాకు ఈ సమస్య ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ ఫుడ్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకమ్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాకి కూడా ఈ సమస్య ఉంది. ఇటీవల ఈ సమస్య చాల అమందికి వస్తుంది. కరోనా తర్వాత ఈ సమస్య అందరిలో పెరిగింది. చాలా మంది తమ లక్షణాలను తగ్గించాలని బలవంతంగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇలా చేస్తే ఇంకా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి ఇంకా ఎలాంటి ఫలితం కనబడకపోతే సైకాలజిస్టులను కలవాలి.