Ice Cubes : ఐస్ క్యూబ్స్ తో బ్యూటీ పెంచుకోవచ్చు తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

November 25, 2022 | 01:07 PM

Ice Cubes : ఐస్ క్యూబ్స్ తో బ్యూటీ పెంచుకోవచ్చు తెలుసా..?

Ice Cubes :  మనకు నిద్ర తక్కువైనా, ముఖంపై దుమ్ము ధూళి ఎక్కువైనా కూడా ఫేస్ గ్లో తగ్గుతుంది. ఫేస్ గ్లో తొందరగా మెరుగవడానికి, కాంతివంతంగా కనబడడానికి ఐస్ క్యూబ్స్ తో మర్దన చేసుకుంటే మంచిది. ఇది తొందరగా ముఖానికి గ్లో తీసుకొస్తుంది. ఈ ఐస్ క్యూబ్స్ ని కూడా రకరకాల పదార్థాలతో తయారు చేసుకొని వాడితే ఇంకా గ్లో రావడంతో పాటు, ముఖంపై మచ్చలు, మొటిమలు పోగొట్టొచ్చు.

*దోసకాయ ముక్కలను క్రష్ చేసి దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి దానిని ఐస్ ట్రేలో పెట్టి క్యూబ్స్ గా చేసి వాటితో మొహంపై రుద్ద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.
*పసుపు, రోజ్ వాటర్ కలిపి ఐస్ క్యూబ్స్ చేస్తే దానితో ఫేస్ పై, కళ్ళ కింద రాసుకుంటే కళ్ళ కింద మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
*ఐస్ క్యూబ్స్ ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి.
*కుంకుమ పువ్వును రోజ్ వాటర్ తో కలిపి ఐస్ క్యూబ్స్ తయారుచేసుకుంటే వాటితో ముఖంపై స్క్రబ్ చేసుకుంటే నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
*నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులను, కొద్దిగా అలోవెరా జెల్ ను కలిపి ఐస్ క్యూబ్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోతాయి.
* ఐ బ్రోస్ చేయించినపుడు కలిగే నొప్పిని తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ తో మర్దన చేసుకోవాలి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* రోజా పువ్వును ఎండిన తరువాత వాటికీ కొద్దిగా రోజ్ ఆయిల్ కలిపి ఐస్ క్యూబ్స్ చేసి వాటితో స్క్రబ్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
* ఏదయినా మేకప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్ తో ఫేస్ స్క్రబ్ చేసుకుంటే కూడా ఫేస్ ఫ్రెష్ గా అనిపిస్తుంది.