Sleep : మహిళలు, పురుషులు సరైన సమయం నిద్రపోతున్నారా? ఎవరికీ ఎక్కువ నిద్ర కావాలో తెలుసా?

ఈ రోజుల్లో ఎవరికీ వారు ఉరుకుల పరుగుల జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి నిద్రకు సరైన సమయం కేటాయిస్తున్నారో లేదో తెలుసుకోండి. నిద్ర మనకు సరిపడా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము.............

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 10:00 PM

Sleep : మహిళలు, పురుషులు సరైన సమయం నిద్రపోతున్నారా? ఎవరికీ ఎక్కువ నిద్ర కావాలో తెలుసా?

Sleep :  ఈ రోజుల్లో ఎవరికీ వారు ఉరుకుల పరుగుల జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి నిద్రకు సరైన సమయం కేటాయిస్తున్నారో లేదో తెలుసుకోండి. నిద్ర మనకు సరిపడా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. మంచి నిద్ర అనేది మన శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది ఇంకా మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను అరికడుతుంది. మంచి నిద్ర అనేది ఎవరికీ అంత తొందరగా పట్టదు. ఈ రోజుల్లో చాలామంది టైమ్ తో సంభంధం లేకుండా ఎప్పుడూ ఫోన్స్ చూస్తూ ఉంటున్నారు. కొంతమంది నిద్ర రావట్లేదని ఫోన్స్ చూస్తున్నారు కానీ ఫోన్ చూడడం వలన నిద్ర అనేది తొందరగా రాదు. కాబట్టి నిద్ర రాకపోతే ఫోన్ చూసే అలవాటును మానుకోండి.

మహిళలు, పురుషులు ఎవరైనా కనీసం ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ ఈ రోజుల్లో మహిళలు ఇంటి పని, ఆఫీస్ పనులు అన్ని చూసుకోవాలని ఉదయమే లెగుస్తుంటారు. దాని వలన తక్కువ సమయం నిద్ర పోతుంటారు. అదేవిధంగా పురుషులు, మహిళలు వారి జీవన విధానాల మీద అధ్యయనం చేసి ఎవరు ఎంత సమయం నిద్రకు కేటాయించాలి అనేది తెలిపారు. దానిలో పురుషుల కంటే మహిళలు నిద్రకు ఒక అరగంట సమయం ఎక్కువసేపు కేటాయించాలి అని తేలింది.

మహిళలకు నిద్ర అనేది తగినంత లేకపోతే బరువు త్వరగా పెరుగుతారు. ఎందుకంటే సరైన నిద్ర లేకపోతే కార్టిసాలల్ అనే ఒత్తిడిని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. దీని వలన గర్భం సమస్యలు, రుతుక్రమ సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా లేకపోవడం వలన మానసికంగా ఆందోళన, నిరాశ చెందడం వంటివి కలుగుతాయి. మహిళలు, పురుషులలో ఎవరికైనా నిద్రలో మూడు దశలు ఉంటాయి.

Food in Restaurants : రెస్టారెంట్స్ లో మరీ ఎక్కువ తినేస్తున్నారా? తక్కువ తినాలంటే ఏం చేయాలి?

నిద్రలో ఉండే మొదటి మూడు దశలను నాన్ రాపిడ్ ఐగా చెబుతారు. అయితే వీటిలో మహిళలు, పురుషులు ఒకే రకంగా నిద్రించరు. మహిళలు తొందరగానే మూడవ దశ అయిన గాఢ నిద్రలోకి వెళతారు. మొదటి రెండు దశలలో తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. పురుషులు మొదటి రెండు దశలలో కూడా తమ సమయాన్ని కేటాయించి తరువాత గాఢ నిద్రలోకి వెళతారు. కాబట్టి మహిళలు పురుషుల కంటే ఒక అరగంట సేపు ఎక్కువ సమయం నిద్రించాలి.