Custard Apple Leaves : సీతాఫలం ఆకుల వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా??

Kaburulu

Kaburulu Desk

December 28, 2022 | 01:00 PM

Custard Apple Leaves : సీతాఫలం ఆకుల వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా??

Custard Apple Leaves :  తియ్యగా ఉండే సీతాఫలం పండ్లంటే చాలా మందికి ఇష్టమే. సీతాఫలం పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సీతాఫలం ఆకులని కూడా తినవచ్చని మీకు తెలుసా?. సీతాఫలం ఆకులు, బెరడుతో కషాయాలు చేసుకొని తాగవచ్చు, ఇలా చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సీతాఫలం ఆకులను కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు.

Gastric Problem : గ్యాస్ బాధని తగ్గించడం ఎలాగో తెలుసా..?

*సీతాఫలం చెట్టు ఆకులకు కొద్దిగా పసుపు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని చర్మ సమస్యలనుండి బయటపడటానికి వాడొచ్చు. చర్మంపై వచ్చే తామర, గజ్జి, దురదలు వంటివి ఈ మిశ్రమంతో తగ్గుతాయి.
*సీతాఫలం ఆకులను మెత్తగా నూరి సెగ్గడ్డలపై ఉంచి గుడ్డతో కట్టు కట్టాలి ఇలా చేస్తే సెగ్గడ్డలు తగ్గుతాయి.
*సీతాఫలం ఆకులను మెత్తగా నూరి అవాంఛిత రోమాలు ఉన్నచోట అరగంట సేపు ఉంచి తరువాత నీటితో కడగాలి ఇలా తరచూ చేయడం వలన అవాంఛిత రోమాలు శాశ్వతంగా తొలగిపోతాయి.
*సీతాఫలం ఆకులతో కషాయాన్ని చేసుకొని రోజూ తాగడం వలన రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.
*సీతాఫలం చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని తాగడం వలన డయేరియా సమస్య తగ్గుతుంది.
*సీతాఫలం చెట్టు బెరడు కషాయం తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
*ఒక గ్లాసు నీటిలో నాలుగు లేదా ఐదు కడిగిన సీతాఫలం ఆకులను వేసి నీటిలో మరిగించాలి ఈ నీటిని తాగడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది.
*సీతాఫలం ఆకులతో తయారుచేసిన చేసిన నీటిని తాగడం వలన గుండె జబ్బులు త్వరగా రావు.