Jasmine Oil : మల్లెపూల ఆయిల్ ఉందని తెలుసా? జాస్మిన్ ఆయిల్ వల్ల బోలెడన్ని ప్రయోజనాలు..
ఎండాకాలంలో ఎక్కువగా పూసే పువ్వులు మల్లెపువ్వులు. ఇవి తలలో పెట్టుకోవడమే కాకుండా వీటితో నూనెను తయారుచేస్తారు. ఇది అత్యంత ఖరీదయిన నూనెలలో ఒకటి. జాస్మిన్ నూనె రెండు లేదా మూడు చుక్కలు.................

Jasmine Oil : ఎండాకాలంలో ఎక్కువగా పూసే పువ్వులు మల్లెపువ్వులు. ఇవి తలలో పెట్టుకోవడమే కాకుండా వీటితో నూనెను తయారుచేస్తారు. ఇది అత్యంత ఖరీదయిన నూనెలలో ఒకటి. జాస్మిన్ నూనె రెండు లేదా మూడు చుక్కలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఎంతో సువాసనను కలిగి ఉంటాయి. జాస్మిన్ నూనెను క్వీన్ అఫ్ ది నైట్ అని కూడా పిలుస్తారు. ఈ జాస్మిన్ నూనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Leafy Vegetables : వండేముందు ఆకుకూరలను శుభ్రం చేస్తున్నారా.. లేకపోతే..
*మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి జాస్మిన్ నూనె ఎన్నో ఏళ్లుగా ఉపయోగపడుతుంది.
*ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మల్లె నూనెను ఆందోళన, ఒత్తిడి తగ్గించడానికి ఔషధంగా వాడతారు.
*జాస్మిన్ ఆయిల్ ను మన ఇంటిలో వాస్తు దోష నివారణకు కూడా ఉపయోగిస్తారు.
*జాస్మిన్ ఆయిల్ ఒక లీటరు ధర నాలుగు లక్షలు. ఒక లీటరు జాస్మిన్ నూనె తయారీకి సుమారు ఐదు వేలకు పైగా మల్లెమొగ్గలు అవసరం అవుతాయి.
*నిద్రలేమిగా ఉన్నవారు జాస్మిన్ నూనెను వాడడం వలన నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
*జాస్మిన్ నూనెను ఇంటిలో పెడితే ఆ ఇంటివారికి మానసిక శాంతి, బలం చేకూరతాయి.
*జాస్మిన్ నూనెను ఇంటిలో ఉంచుకోవడం వలన మనలో ఆత్మవిస్వాసం పెరుగుతుంది.
*కెరీర్ లో విజయం సాధించాలి అనుకునేవారు కూడా జాస్మిన్ నూనెను ఇంటిలో ఉంచుకుంటే విజయాన్ని పొందుతారు అని కూడా కొంతమంది నమ్ముతారు.